పెయింటింగ్ మీ హాబీయా? ఐతే.. రాష్ట్రీయ కళామంచ్ సువర్ణావకాశం మీ కోసమే..

విజయవాడ: రాష్ట్రీయ కళా మంచ్ -ఆంధ్రప్రదేశ్ విద్యార్థి కళాకారుల వేదిక . విద్యార్థి కళాకారుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలను వెలికితీయాలనే మహా సంకల్పంతో జాతీయ స్థాయిలో పని చేస్తోంది. ఈనాడు మన భారతీయ కళలలో అతి ప్రాచీనమైన కళ చిత్రకళ . చిత్రకళ ద్వారా మన సంస్కృతి, సాంప్రదాయం మరియు మన జీవన విధానం తెలుస్తుంది. హరప్పా, సింధూ నాగరికతలను తెలుపుతుంది. మన సనాతన ధర్మం లో చిత్రకళకు ఎంతో అదరణ ఉంది. రామాయణం, మహా భారతం వంటి పురాణ ఇతిహాసాలను పామరుల నుండి పండితుల వరకూ సులభంగా తెలుపుటకు చిత్రకళ దోహదం చెస్తుంది. భారతీయ చిత్రకళ ప్రపంచ చిత్రకళకు ఉదాహరణగా నిలిచింది.

 

ఈ కార్యక్రమంలో భారతీయ చిత్రకళలోని కలంకారీ చిత్రకళ పరిచయం, మరియు విదేశీ చిత్రకళలో మన భారతీయ చిత్రకళ సమ్మేళనం వంటి అంశాలతో ఐదుగురు చిత్రకారులతో వారి వివిధ శైలిలో చిత్రాలను మనకు ప్రత్యక్షంగా చూపిస్తారు. ఈ కార్యక్రమం, శుక్రవారం 23.19.2020 న సాయంత్రం 5 గంటలకు Rashtriya kalamanch ap …F.B.లో లైవ్ కార్యక్రమం ఉంటుంది. కళామంచ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ నాధముని, కో కన్వీనర్ శ్రీనాధ్‌ను 8374868762, 9182029839, 9100535286 ఈ నెంబర్ల ద్వారా సంప్రదించగలరు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*