పరమేశ్వరుడికి శివపురాణం అత్యంత ప్రీతి పాత్రమైనది.. ఎందుకో తెలుసా?

పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది శివపురాణం

ఓం నమశ్శివాయ వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. (ప్రార్ధన శ్లోకం) అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి.పురాణాల ప్రకారం నాలుగవ స్థానము నందు ఒకచోట శివపురాణం మరియొక చోట వాయు పురాణము లెక్కింపబడినది. ఈ పురాణం మొదటిగా శివుడు వాయువునకు బోధించాడు. విషయవస్తు దృష్టిలో ఈ రెండు అత్యంత అని పేర్కొన బడినవి. “అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే. సమస్త జగదాధారాయ మూర్తయే బ్రహ్మణే నమః”. సచ్చిదానంద స్వరూపం, పరాత్పర బ్రహ్మము, ఉన్నది ఒక్కడే. అది సర్వదా పూర్ణం. సమస్త లోకములకు అతనిని మూలము అతనే మూలము. అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి. వాయవీయ సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు లక్ష శ్లోకాలు ఉండేవట. కానీ వేదవ్యాసుడు పురాణాలను విభజన చేసిన తరువాత ఇందులో 24,000 శ్లోకాలున్నావి. వ్యాసుడు ఈ పురాణము తన శిష్యుడైన రోమహర్షునకు ఉపదేశించాడు.

శివ పురాణాన్ని ఏడు సంహితలు గా విభజించారు.

1. విద్యేశ్వర సంహిత.
2 రుద్ర సంహిత (రుద్ర సంహిత లో అయిదు ఖండములు ఉన్నవి).
1. సృష్టి , సతీ , పార్వతి, కుమార, యుద్ధ ఖండములు. ః
3. శత రుద్ర సంహిత,
4. కోటి రుద్ర సంహిత,
5. ఉమా సంహిత,
6. కైలాస సంహిత,
7. వాయివిత సంహిత.

ప్రతి అధ్యాయంలోనూ ఉపాఖ్యానము ఉన్నవి. పూజా విధానాలు చెప్పబడినవి.
: శివ అనే శబ్దము చాలా గొప్పది. శివమహా పురాణము శివ శబ్దముతో ప్రారంభమైనది. శివ అనే శబ్దమునకు అమరకోశంలో స్పష్టముగా చెప్పబడినది. శివ అంటేనే మంగళ ప్రదుడు. శివుని అవతారాలలో 13 వది అయిన హరిహర అవతారము ఒకటి. హరిహర అవతారము అంటే, శివునిలో అర్థభాగం నారాయణుడు. ఈ అవతారం చూసి పార్వతీదేవి. అర్థ శరీరం పొందే విధానాన్ని నారాయణుని తెలుపమని కోరింది. అప్పుడు నారాయణుడు పార్వతీదేవికి శివ అష్టోత్తర శతనామావళిని ఉపదేశించాడు. అదియే పద్నాలుగవ (14) అవతారము అర్ధనారీశ్వర అవతారము. ఈ శివ అష్టోత్తరమును అసుర సంధ్య వేళ చదివిన గృహమునందు సమస్తమైన కోర్కెలు తీరుస్తుంది. పరలోక సుఖము, భగవంతుని అనుగ్రహం లభిస్తుంది.

: “శివో మహేశ్వరః” అని పిలుస్తారు “మహేశ్వరః” అనే నామం చాలా చిత్రమైన నామము. మంత్రపుష్పం చెప్పినప్పుడు. “ఈశానస్సర్వ విద్యానామీశ్వరస్సర్వ భూతానాం బ్రహ్మాధిపతిర్. బ్రహ్మణోధిపతీర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం”. అని చెబుతాము . సర్వ మంగళ ములకు కారణమైనవాడు, సృష్టి స్థితి లయములను, చేయువాడు తానొక్కడే అయి ఉండి, కానీ సృష్టి చేసినప్పుడు ఒకడిగా, లయకారకుడుగా ఉన్నప్పుడు ఒకడిగా, మూడుగా కనబడుతూ ఆయన అనుగ్రహం చేత జ్ఞానము కలిగినప్పుడు అవి మూడు కావు ఒక్కటే అన్న జ్ఞానము ఎవరు నుండి ప్రసరిస్తుందో అతను మహేశ్వరుడు. శివపురాణం – ఫలశ్రుతి పరమపవిత్రమైన శివపురాణాన్ని ప్రయత్నపూర్వకంగా ఎంతో భక్తితో పఠించాలి. లేదా వినాలి. ఈ దివ్య పురాణాన్ని ఏతచ్భుత్వా హ్యేకవారం భవేత్పాపం హి భస్మసాత్ | అభక్తో భక్తిమాప్నోతి భక్తో భక్తి సమృద్ధిభాన్ || ( శ్లో 45 – అధ్యా 41 ) ఒక్కసారి వింటే చాలు పాపాలన్నీ భస్మమైపోతాయి. శివభక్తి లేని వాడికి భక్తి కలుగుతుంది . భక్తి ఉన్నవాడికి ఇంకా భక్తి పెంపొందుతుంది. మోక్షం కావాలని కోరుకునేవాడు ఈ దివ్యపురాణాన్ని అయిదుసార్లు చదవాలి. ఎవరైతే ఈ శివపురాణాన్ని భక్తితో పారాయణ చేస్తాడో లేక వింటాడో అతడు సకల పాపాలనుంచీ విముక్తుడై శివసాయుజ్యాన్ని పొందుతాడు. భుక్తిని ముక్తిని ప్రసాదించే ఈ శివపురాణం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది.

 

-పి. ఫిరోజి బాబు, ఎం ఏ పురాణేతిహాస విభాగము, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి

P.phiroji babu M.A puranethihasa rastriya Sanskrit vidhyapeet Tirupati.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*