కృష్ణ బియ్యం పండించాలనుకునే రైతన్నలకు కృషి భారతం విత్తన పంపిణీ

హైదరాబాద్: సేంద్రీయ వ్యవసాయం ద్వారా కృష్ణ బియ్యం పండించాలనుకునే రైతన్నల కోసం కృషి భారతం సంస్థ విత్తనాలు తీసుకొచ్చింది. భారతీయ వ్యవసాయ పద్ధతులపై పరిశోధనలు చేస్తున్న కృషి భారతం సంస్థ వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులకు కృష్ణ వ్రీహీ పంపిణీ చేయాలని సంకల్పించారు.

భారతీయ గోవు ఉన్న రైతులకే విత్తన పంపిణీ

భారతీయ గోవు ఉన్న రైతులకు మాత్రమే ఈ విత్తనాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. గోవు, వృషభాల సంరక్షణ ద్వారా వేద వ్యవసాయం సాధ్యమౌతుందని ఆయన చెబుతున్నారు. అందుకే భారతీయ గోవు ఉన్న రైతులకే విత్తనాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు.

విత్తనాలు కావాలనుకునేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

విత్తనాల పంపిణీ నవంబర్ ఒకటో తారీకు నుంచి ప్రారంభమవుతుంది. అయితే విత్తనాలు కావాలనుకునేవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం కృషి భారతం ఆన్ లైన్ లింక్ అందుబాటులోకి తెచ్చింది.

రిజిస్ట్రేషన్ ఉచితం

రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమని కృషి భారతం సంస్థ తెలియజేసింది. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారి గ్రామాలకు లేదా దగ్గరలో ఉన్న ఆర్టీసీ ట్రాన్స్‌పోర్ట్ దగ్గర విత్తనం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని కృషి భారతం ప్రతినిధులు తెలిపారు.

రిజిస్ట్రేషన్ చేసుకున్న 15 రోజుల్లో విత్తనాలు

రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే కృషి భారతం సంస్థ నుంచి రైతన్నలకు ఫోన్ చేయడంతో పాటు పంపిణీ వివరాలు తెలియజేస్తామని కృషి భారతం ప్రతినిధులు తెలిపారు.

అర ఎకరానికి ఐదు కిలోల విత్తనాలు చాలు

అర ఎకరానికి ఐదు కిలోల విత్తనాలు సరిపోతుందని కృషి భారతం ప్రతినిధులు చెబుతున్నారు. తొలుత విత్తనాన్ని అభివృద్ధి చేయాలనుకునే రైతన్నలు ముందుకు రావాలని కౌటిల్య కృష్ణన్ పిలుపునిచ్చారు. భూమిని కాపాడుకోవడంతో పాటు, ప్రకృతిని సంరక్షించాలనే రైతన్నలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. దేశవాళీ విత్తనాల అభివృద్ధి కోసం కలిసి నడుద్దామని, భారత భూమిని మళ్లీ సస్యశ్యామలం చేద్దామని ఆయన అన్నదాతలకు పిలుపునిస్తున్నారు.

పంట‌కాలం- 120 రోజులు

కృష్ణ బియ్యం పంటకాలం కేవలం 120 రోజులేనని కృషి భారతం ప్రతినిధులు చెబుతున్నారు.

రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కింది లింక్‌పై క్లిక్ చేయగలరు.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfyHfH4nyB3Wp35Bg14W3g05vvasJiEBEtIemnOODbUEalG7Q/viewform?vc=0&c=0&w=1&flr=0

 

సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే సంప్రదించాల్సిన నెంబర్లు

8686743452, 7095778791

 

సంప్రదించాల్సిన ఈ మెయిల్

krishibharatham@gmail.com

 

సంప్రదించాల్సిన వెబ్‌సైట్

www.krishibharatham.org

http://www.krishibharatham.org/

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*