
చిట్టి చైర్
బుల్లి బెడ్
అర చేతిలో ఇమిడే కప్ సెట్
అబ్బురపరిచే కుట్టు మెషిన్
ఒక్కటేమిటి ఇలాంటి వందల మినియేచర్స్ ఆర్టికల్స్ కి ప్రాణం పోస్తున్నారు రమ గారు
హలో రమ గారు
నమస్తే
మీకు ఈ మినియేచర్స్ ఆర్ట్ ఐడియా ఎలా వచ్చింది?
నాకు చిన్నప్పటి నుంచి కనిపించిన వస్తువులతో ఆర్టికల్స్ చేయడం అలవాటు. మొదట్లో చిన్న చిన్న బొమ్మలు కనిపిస్తే కొనుక్కునేదాన్ని. తరువాత నేనే వాటిని తయారు చేసుకుంటే బాగుంటది కదా అని అనిపించింది. అలా మొదలయింది.
ఎప్పటి నుంచి చేస్తున్నారు?
దాదాపు 35 సంవత్సరాల నుంచి ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ కొన్ని వందల మినియేచర్స్ చేశాను. నా ఆర్టికల్స్ తో చిన్న మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరిక.
https://www.instagram.com/tv/CG0E5lCin32/?igshid=1jxgzz1yt7p4f
మీరు ఎక్కడ ఉంటారు?
వైజాగ్
https://www.instagram.com/tv/CG0Hw6CCbf-/?igshid=1d2c6mdhg9kci
సేల్ చేస్తారా? ఎవరైనా ఆర్డర్ చేయాలంటే ఎలా కాంటాక్ట్ చేయాలి?
ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఆర్డర్స్ ఇవ్వొచ్చు. ఫేస్బుక్ లో
Rama Sudheer అని ID ఉంటుంది.
https://www.facebook.com/profile.php?id=100010175559900
మీరు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే మీరే తయారుచేస్తారట !
అవును. వారి అభిరుచి బట్టీ ముందే ఒక ఐడియాతో గిఫ్ట్ రెడీ చేసి ఇస్తాను.
మీ యూట్యూబ్ ఛానల్ గురించి?
ABCD.. Any Body Can Do.. అని మా యూట్యూబ్ ఛానల్ పేరు. అందులో ఈ మినియేచర్స్ కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. ఎలా చేయాలో కూడా వివరంగా ఉంటుంది.
థాంక్ యూ రమ గారు
– Manjeetha, Eekshanam Journalist, Bangalore.
Be the first to comment