`అర్ధ శతాబ్దం` నుంచి `పుష్ప` లుక్ రిలీజ్ చేసిన న‌టి శ్రీ‌దివ్య‌

కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో రిషిత శ్రీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం `అర్ద శతాబ్ధం`. అందాల రాక్ష‌సి ఫేం నవీన్ చంద్ర పవర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తున్నారు. రవీంద్ర పుల్లే దర్శకుడు. చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపులో ఉంది. ఇటీవ‌ల రానా రిలీజ్ చేసిన మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ ప్రేక్ష‌కుల్లోకి దూసుకెళ్లింది.

తాజాగా బ‌తుక‌మ్మ సంబురాల‌ సంద‌ర్భంగా `పుష్ప‌` పాత్ర లుక్ ని ప్ర‌ముఖ న‌టి శ్రీ‌దివ్య లాంచ్ చేశారు. ఈ లుక్ కి అన్ని వ‌ర్గాల నుంచి అద్భుత స్పంద‌న వ‌స్తోంది. పుష్ప పాత్రలో కృష్ణ ప్రియ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంద‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు. కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ రత్నం ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నారప్పలో వెంకటేష్ కుమారుడిగా నటిస్తున్నారు. అలాగే అర్థ శతాబ్దం సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రతో మెరిపించ‌నున్నారు. ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. రవీంద్ర నేరేట్ చేసిన క‌థ‌ను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: రిషిత శ్రీ క్రియేషన్స్
రచన,దర్శకత్వం: రవీంద్ర పుల్లే,
నిర్మాత: చిట్టి కిరణ్ రామోజు,
డిఓపి: అష్కర్ (బాయ్ ఫేమ్),
సంగీతం: నౌఫల్ రాజా (ఎ.ఐ.ఎస్)
ఆర్ట్: సుమిత్ పటేల్,
కాస్ట్యూమ్స్: పూజిత తాడికొండ
ఎడిటర్: జె. ప్రతాప్ కుమార్,
పాటలు: రెహమాన్,
స్టాంట్స్: అంజి,
పిఆర్ఓ: సాయి సతీష్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*