
‘‘జాగృత భారతం ` సంపన్న భారతం’’ నినాదంతో నిఘా అవగాహనా వెబినార్‌ను
నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్: అక్టోబర్ 27 నుండి నవంబర్ 02, 2020 వరకు దక్షిణ మధ్య రైల్వే నిఘా అవగాహనా వారోత్సవాలను ` 2020ను పాటిస్తోంది. ఈ వారోత్సవాల సందర్భంగా ‘‘జాగృత భారతం ` సంపన్న భారతం’’ పేరిట వెబినార్‌ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోన్వ్యాప్తంగా పెద్దఎత్తున అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్, రామకృష్ణమఠం, హైదరాబాద్ డైరెక్టరు స్వామి బోధమయానంద ముఖ్య అతిథిగా హాజరు కాగా, డా॥ జయప్రకాష్ నారాయణ, ప్రధాన కార్యదర్శి, డెమోక్రటిక్ రిఫార్మ్స్, ‘‘లోక్‌సత్తా’’ పార్టీ వ్యవస్థాపకుడు మరియు ప్రొ॥ ఎం. శ్రీధర్ ఆచార్యులు, స్కూల్ ఆఫ్ లా, బెనెట్ యూనివర్సిటీ యాక్టింగ్ డీన్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గజానన్ మ్యా, జనరల్ మేనేజరు, దక్షిణ మధ్య రైల్వే అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో బి.బి. సింగ్, అదనపు జనరల్ మేనేజరు మరియు చంద్రిమా రాయ్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మరియు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, దక్షిణ మధ్య రైల్వే పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వామి బోధమయానంద మాట్లాడుతూ, భారత సమాజం అపూర్వమైన పరివర్తన దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. కోవిడ్`19 క్లిష్ట పరిస్థితు జీవితం యొక్క ప్రతీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, ఇది పని సంస్కృతిని కూడా మార్చివేసిందని అన్నారు. మంచి విషయాలను వినాలి, మంచిని గురించి మాట్లాడాలి మరియు ఉపయోగకరమైన విషయాలను ఆచరించి మన జీవితాలను ఫలవంతంగా, ప్రశాంతంగా మరియు అర్ధవంతంగా మార్చుకోవాలని ఆయన సూచించారు. యువతను, ప్రజలను సరైన మార్గంలో నడిపించడానికి సమాజానికి దీపస్థంభాల వంటి వ్యక్తులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మానవీయ విశిష్టతను చాటే మరియు మార్పు దిశగా మంచి పరివర్తకులుగా మారాల్సిన సమయం వచ్చిందని ఆయనన్నారు. ‘‘జాగృత భారతం ` సంపన్న భారతం’ అన్న భావన మన ప్రాచీన గ్రంథాల్లోనూ, ప్రాచీన సంస్కృతిలోనూ ఇమిడి ఉన్నదని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న డా॥ జయప్రకాష్ నారాయణ అవినీతి నిర్మూనకు చేపట్టాల్సిన చర్యను గురించి వెల్లడించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవను అందించే దిశగా, సంస్కరణలను అమలు పరిచేందుకుగాను దక్షిణ మధ్య రైల్వేలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని ఆయన ఎంతగానో ప్రశంసించారు. కంప్యూటరైజ్డ్ టికెట్ బుకింగ్ పారదర్శకతకు బాటలు వేసిందని మరియు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా మారిందని పేర్కొన్నారు. అవినీతి అనేది ఉత్పాదకతకు విఘాతంగా పరిణమిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సమాజంలో అవినీతిని నిర్మూలించాంటే సంస్థాగత వ్యవస్థ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో అవినీతి పెరుగుతోందన్నది ఒక భావనగా ఉందని, కానీ వాస్తవంగా చూస్తే అది తగ్గుముఖం పడుతోందని, ఏకచ్ఛత్రాధిపత్యం అవినీతికి దారి తీస్తుందని మరియు పారదర్శకత అవినీతిని నిర్మూలిస్తుందని డా॥ జయప్రకాష్ నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రొ॥ ఎం. శ్రీధర్ భారతీయ సంస్కృతి మరియు పౌరుల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే వ్యవస్థను గురించి ప్రసంగించారు. భారతీయులుతమ జీవితంలో ఆరు వేదాలతో ఎంతో ప్రభావితుయ్యారని, ప్రాచీన నాలుగు వేదాలే కాకుండా, మహాభారతం పంచమ వేదంగా మరియు భారత రాజ్యాంగం ఆరవ వేదంగా పరిగణింపబడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు గజానన్ మ్యా జాతిపిత వ్యాఖ్యను ఉటంకిస్తూ, భూమాత ప్రతీ ఒక్కరి అవసరాలను సంతృప్తి పరుస్తుందని, కానీ అత్యాశను కాదని తెలిపారు. ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం లేనిదే ఏ ప్రయత్నం విజయవంతం కాలేదని, అవినీతిని నిర్మూలించే దిశగా ఈ వారోత్సవాలను జరుపుకోవడం ద్వారా సిబ్బందిలో అవగాహనను పెంపొందించవచ్చునని పేర్కొన్నారు. అవినీతి నిర్మూలన దిశగా దక్షిణ మధ్య రైల్వే ఇ`ఆఫీస్ మరియు ఇ` టెండరింగ్ మొదలగు సంస్కరణలను అమలు చేయడంలో మొదటి వరుసలో ఉందని వెల్లడించారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య, గౌరవ అతిథులు, తదితరులు దక్షిణ మధ్య రైల్వే యొక్క ‘‘అనిమిష’’ విజిలెన్స్ డిజిటల్ బులెటిన్‌ను ఆవిష్కరించారు. తదుపరి చంద్రిమా రాయ్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, సీవీవో, దక్షిణ మధ్య రైల్వే చంద్రిమా రాయ్ ఓట్ ఆఫ్ థాంక్స్ చెప్పారు.
ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో అధికారులు మరియు సిబ్బందిచే జనరల్ మేనేజర్ గజానన్ మ్యా విజిలెన్స్ ప్రతిజ్ఞ చేయించారు.
This post is also available in : English
Be the first to comment