మహిళా శక్తిపై రామకృష్ణ మఠం ప్రతిష్టాత్మక కార్యక్రమం

హైదరాబాద్: నగరంలోని రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ భారత పునరుజ్జీవనంలో మహిళా శక్తి పాత్ర’ అనే అంశంపై వెబినార్ నిర్వహిస్తోంది. వీఐహెచ్ఈ డైరెక్టర్ స్వామి బోధమయానంద ఆధ్వర్యంలో జరగనున్న ఈ వెబినార్‌కు ‘యూత్ ఫర్ సేవా’ మాజీ జాతీయ సమన్వయ కర్త స్వాతి రామ్, ముంబైలోని రామకృష్ణ శారదా సమితి మేనేజింగ్ ట్రస్టీ, ఆర్కిటెక్ట్ విద్యా రఘు, పూణేకు చెందిన విజన్ వరల్డ్ వ్యవస్థాపకురాలు సి.ఎ. ఐశ్వర్య దీపక్ వక్తలుగా పాల్గొననున్నారు.

 

నవంబర్ 1న ఆదివారం ఉదయం 11 గంటలకు వెబినార్ ప్రారంభం కానుంది. జూమ్ యాప్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. రామకృష్ణ మఠానికి చెందిన యూట్యూబ్‌లో కూడా తిలకించొచ్చు. మరిన్ని వివరాలకు volunteersvihe@gmail.comలో సంప్రదించగలరు. జూమ్ ఐడీ: 832 5779 5009, పాస్‌వర్డ్: 12345

ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.

 

మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*