సిద్ధిపేటలో ఉద్రిక్తత.. బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో సిద్ధిపేటలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. కాగా స్థానికంగా ఉన్న స్వర్ణా ప్యాలెస్‌ హోటల్‌లో డబ్బులు పంచుతున్నట్లు సమాచారం ఉందంటూ బీజేపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అదే హోటల్‌లో బస చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.

మరోవైపు బీజేపీ కార్యకర్తలు శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని, తనను కొట్టే ప్రయత్నం చేస్తుంటే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. బీజేపీ దాడిలో టీఆర్‌ఎస్‌ కార్యకర్త గాయపడ్డారని పేర్కొన్నారు.

మరోవైపు  దళిత ఎమ్మెల్యేపై దాడి హేయమైన చర్య మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. పథకం ప్రకారమే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. బీజేపీ నాయకులు దళిత బిడ్డలైన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సిద్దిపేటలోనీ స్వర్ణ ప్యాలెస్లో దాడికి పాల్పటం హేయమైన చర్య అని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మండిపడ్డారు. ఈ దాడికి పాల్పడిన బీజేపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమీషన్, పోలీసు డిపార్టుమెంట్‌ను కోరుతున్నామన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*