విజయవాడ రామకృష్ణ మిషన్ కథా స్రవంతి – ‘చిన్నారులకు చిట్టికథలు’

విజయవాడ: సామాజిక చైతన్యం కలిగించడంలో, వ్యక్తిత్వాన్ని వికసింప చేయడంలో ముందుండే విజయవాడ రామకృష్ణ మిషన్.. చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. కథల రూపంలో చెప్పే విషయాలు చిన్నారుల మనసుల్లో బలంగా నాటుకుంటాయన్న విషయం తెలిసిందే. ఈ ఉద్దేశంతో స్వామి వివేకానంద చెప్పిన కథలను యూట్యూబ్ ద్వారా అందిస్తోంది. ‘చిన్నారులకు చిట్టికథలు’ అనే శీర్షికతో ప్రతి రోజూ ఓ కథను వినిపిస్తున్నారు.

మిషన్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్‌లో సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9.45 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. చిన్నారుల కోసం రూపొందించిన ఈ కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా మిషన్ కోరుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*