
హైదరాబాద్: యూట్యూబ్ ఛానల్ అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే అనుకునే ఈ కాలంలో కుటుంబ విలువలకు పెద్దపీట వేస్తూ ‘ఆర్ఎస్ టీవీ’ మనముందుకు వచ్చింది. మన గ్రంథాలలోని స్ఫూర్తిదాయక అంశాలను, నీతి కథలను, సామాజిక విషయాలను అందించనుంది. అలాగే మూర్తిత్రయం రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానందుల బోధనలను యూట్యూబ్ ద్వారా వినిపించనున్నారు. గత అక్టోబర్ 12న ఈ ఛానల్ ప్రారంభమైందని సంస్థ యజమాని సంపత్ చిన్నమవేని తెలిపారు.
కుటుంబ విలువలతో పాటు తాజా వార్తలు, వంటలు, రైమ్స్ తదితరాలు ఉంటాయని సంపత్ తెలిపారు.
ఇదిలా ఉంటే ‘టాప్ 10 తెలుగు జోన్’ పేరుతో ఛానల్ను కూడా అదే రోజు ప్రారంభించినట్టు సంపత్ చెప్పారు. దీనిలో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల విజయాలతో పాటు, విజ్ఞానం, వినోదం, ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీ, సైన్స్, చరిత్ర, టాప్ 10 ఫ్యాక్ట్స్ అప్ లోడ్ చేస్తామని తెలిపారు.
Be the first to comment