యాదాద్రి డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కల్నల్ సంతోష్ భార్య సంతోషి

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి ట్రైనీ కలెక్టర్‌గా కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి బాధ్యతలు స్వీకరించారు. భారత, చైనా సరిహద్దుల్లో ఇటీవల జరిగిన గొడవలో సూర్యాపేటకు చేoదిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందడంతో అతని భార్య సంతోషిణి తెలంగాణ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. యాదాద్రి జిల్లాకు కేటాయించడంతో సంతోషి ఈ రోజు విధుల్లో చేరారు. జిల్లా కార్యాలయంలో తనను సన్మానిoచడానికి వచ్చిన పలువురు నాయకులను ఆమె భౌతిక దూరం పాటిస్తూ నమస్కరించి పంపించారు. జిల్లా కలెక్టర్ అనిత రాంచంద్రన్‌ను సంతోషి కలిశారు.

లడక్ గల్వాన్ లోయలో జూన్ 15న చైనా బలగాలు కుట్రపూరితంగా చేసిన దాడిలో కల్నల్ సంతోష్ బాబు అమరులయ్యారు.

సంతోష్‌బాబు కుటుంబసభ్యులను పరామర్శించిన సందర్భంగా సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్‌లో స్థలంతో పాటు డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ఇస్తామని సంతోషికి హామీ ఇచ్చారు.

ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లో ఇప్పటికే స్థలం కేటాయించారు. సంతోషి నేడు యాదాద్రి జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*