ఈ పాట ఆణిముత్యంగా నిలిచిపోతుంది.

మురళి బోడపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఒక అమ్మాయితో..విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో తొలిరేయి పాట సంగీత సాహిత్య ప్రియులను గిలిగింతలు పెడుతూ అలరిస్తుందన్నారు.

మౌనశ్రీ మల్లిక్ రాసిన ఈ గీతాన్ని కన్ను సమీర్ అద్భుతంగా స్వరకల్పన చేశాడని ఈ పాట సంగీతసాహిత్యాల మేలు కలయిక అన్నారు. ఇప్పటివరకు మన తెలుగు సినిమాల్లో ఎన్నో మొదటి రాత్రి పాటలు వచ్చాయని అందులో ఈ పాట ఆణిముత్యంగా నిలుస్తుందంటూ.. వేటూరి లోని పద చమత్కారం, ఆత్రేయ లోని పద సంస్కారం కలగలిపి మౌనశ్రీ మల్లిక్ ఈ తొలిరేయి పాటను రాశారని తెలిపారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ తోట వి. రమణ మాట్లాడుతూ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ శైలి చాలా బాగుందని ప్రశంసించారు. ఈ పాటకు భాను మాస్టర్ నృత్య దర్శకత్వం వహించడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*