రామకృష్ణమఠంలో యోగాసనాలపై ఆన్‌లైన్ తరగతులు

హైదరాబాద్: రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ మహిళలకు యోగా తరగతులను ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసింది. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 3 వరకు నాలుగు వారాల పాటు ఈ తరగతులు జరగనున్నాయి. వివిధ యోగాసనాలు, సూర్యనమస్కారాలు తదితరాలలో శిక్షణ ఇవ్వనున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే ఈ తరగతులు సాయంత్రం 5 గంటలకు మొదలై 6 గంటల వరకు ముగియనున్నాయి. 16 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వారు అర్హులు.

అదే సమయంలో పురుషులకు కూడా యోగా తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 4 వరకు నాలుగు వారాల పాటు ఈ తరగతులు జరగనున్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు జరిగే ఈ తరగతులు ఉదయం 6:35 నుంచి 7:45 వరకూ ఈ తరగతులుంటాయి.

 

రామకృష్ణ మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*