స్వామి బోధమయానంద ఆధ్వర్యంలో భగవద్గీత తరగతులు

హైదరాబాద్: రామకృష్ణ మఠంలో స్వామి బోధమయానంద ఆధ్వర్యంలో ప్రతి శనివారం సాయంత్రం భగవద్గీత తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ వారం భగవద్గీత 9వ అధ్యాయంలోని ‘రాజ విద్యా రాజ గుహ్య యోగము’పై తరగతులుంటాయి. రామకృష్ణ మఠం యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా భగవద్గీత తరగతులను వినవచ్చు. సాయంత్రం 5.45 గంటల నుంచి 6.40 గంటల వరకు ఈ తరగతులుంటాయి.

రామకృష్ణ మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.

మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*