
హైదరాబాద్: భారతీయ సంస్కృతి-విద్య అనే అంశంపై భాగ్యనగరంలోని రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. జూమ్ యాప్లో జరగనున్న ఈ చర్చా కార్యక్రమానికి వీఐహెచ్ఈ డైరెక్టర్ స్వామి బోధమయానంద అధ్యక్షత వహిస్తున్నారు. వక్తలుగా కోల్కతాలోని శిల్పమందిర పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ ఛార్జ్ స్వామి వేదాతితనంద, అమృత విశ్వ విద్యాపీఠం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం. ప్రమోద్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నెల 8న ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది.
రామకృష్ణ మఠ్లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.
రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.
Be the first to comment