
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. నాలుగు రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చిరు ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు.
ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. pic.twitter.com/qtU9eCIEwp
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 9, 2020
ఆచార్య సినిమా షూటింగ్‌కు ముందు చిరంజీవి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్‌గా తేలింది.
రెండు రోజుల క్రితం ఆయన అక్కినేని నాగార్జునతో పాటు సీఎం కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్ వరద బాధితులకు సాయం అందించారు. సీఎంకు చెక్ అందించే సమయంలో ఎవ్వరూ మాస్కులు ధరించలేదు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలువురు ప్రముఖులు ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలిసి చెక్కులు అందజేశారు. pic.twitter.com/pzurYrbqyO
— Telangana CMO (@TelanganaCMO) November 7, 2020
మరోవైపు ఎంపీ సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో చిరంజీవి, ఆయన తనయుడు రాం చరణ్ మొక్కలు నాటారు.
I've accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge
from #Prabhas and planted 3 saplings. Further I am nominating @ssrajamouli, @aliaa08, entire my #RRRMovie team and all my fans
to plant 3 trees & continue the chain. Special thanks to @MPsantoshtrs for taking this initiate. pic.twitter.com/oQpl42PA3i— Ram Charan (@AlwaysRamCharan) November 8, 2020
మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.
Be the first to comment