
హైదరాబాద్: కృషిభారతం ఆధ్వర్యంలో ఈనెల 16న (లగుడ ప్రతిపద సందర్భంగా) వృషభోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు అనేక రాష్ట్రాలు, దేశాల్లో వృషభోత్సవం జరగనుంది.
వేదాల్లో గోవుతో సమానంగా ప్రాధాన్యతను కలిగివున్న వృషభం నేడు నిరాధరణకు గురౌతున్న నేపథ్యంలో వృషభానికి పునర్ వైభవాన్ని కల్పించేందుకు కృషిభారతం ఏటా వృషభోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రాచీన వేద వ్యవసాయంపై రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. వేద వ్యవసాయ పద్దతులను రైతన్నలకు వివరిస్తోంది. వేద వ్యవసాయ పండుగల్లో అతిముఖ్యమైన వృషభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
హైదరాబాద్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమం సహా అనేక ఆశ్రమాలు, మఠాలు, పీఠాల్లో వృషభ పూజ, వృషభ యాత్ర ఘనంగా నిర్వహించనున్నారు.
Be the first to comment