ఆరేండ్లలో హైదరాబాద్ ఎంతో పురోగతి సాధించింది: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి కేటీఆర్ ఎక్జిక్యూషన్లో ఆరేండ్లలో హైదరాబాద్ ఎంతో పురోగతి సాధించింది ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధిని కొనసాగించేందుకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని ఆమె పిలపునిచ్చారు. డిసెంబర్ 1 న జరిగే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత, ఆరేండ్ల కింద హైదరాబాద్‌కు, ఇప్పటి హైదరాబాద్‌కు ఎంతో పురోగతి ఉందన్నారు.

హైదరాబాద్ మహా నగరంలో రోడ్లు, ఫ్లై ఓవర్లు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే పరిస్థితులు, 24 గంటల కరెంటు, శాంతి భద్రతలు, ఇవన్నీ సీఎం కేసీఆర్ నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ కారణంగానే ఇంత గొప్పగా ఉన్నాయని కవిత తెలిపారు. ఈ నాయకత్వాన్ని ఇలాగే కొనసాగించే బాధ్యత హైదరాబాద్ ప్రజలపై ఉందన్న కవిత, హైదరాబాద్ నగరం వరుసగా ఐదేండ్లుగా ఇండియాలో బెస్ట్ సిటీగా ఉందని మర్సర్ వంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి ర్యాంకులు, గొప్ప పరిస్థితులు కేవలం మాటలతో రావని…ఎంతో కష్టపడితే మాత్రమే సాధ్యమవుతాయన్నారు.

హైదరాబాద్‌లో ఇదే అభివృద్ధిని కొనసాగించేందుకు, జిహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*