పీఓకేలో ఉగ్ర స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ జరిపిన భారత్ 

శ్రీనగర్: ఉగ్రవాదులపై భారత్ మరోమారు విరుచుకుపడింది. ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరిమరీ చంపుతామని ప్రకటించిన మోదీ అన్నంత పనీ మరోసారి చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత వాయుసేన ఎయిర్‌స్ట్రైక్ జరిపింది. ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత భూభాగంలోకి వచ్చేందుకు సిద్ధమౌతున్న ఉగ్రవాదుల లాంఛ్‌ప్యాడ్‌లపై భారత్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దాడి జరిగినట్లు పీటీఐ ధృవీకరించింది.

 

భారత్ గతంలో పాక్‌లోని బాలాకోట్‌పై సర్జికల్ దాడులు జరిపి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్‌లోకి వచ్చేందుకు యత్నిస్తుండగా ఉగ్రవాదులందరినీ ఏరిపారేసింది.

 

తాజాగా పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై మరోమారు ఎయిర్‌స్ట్రైక్ జరపడం ద్వారా భారత్ గట్టి హెచ్చరికను పంపింది. దీపావళి రోజు జైసల్మేర్‌లో లోంగేవాలా పోస్ట్ వద్ద ప్రధాని ప్రకటన చేశారు. ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామని హెచ్చరిక కూడా చేశారు. అన్నట్లుగానే భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న ఉగ్రవాదులను పెద్ద సంఖ్యలో మట్టుబెట్టింది. దాడిలో 10 మంది పాక్ సైనికులు కూడా హతమయ్యారు. 20 మందికి పైగా గాయపడ్డారు.

 

మరోవైపు నియంత్రణ రేఖ వద్ద ఎయిర్ స్ట్రైక్స్ జరిపినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని భారత ఆర్మీ తెలిపింది.

అయితే జాతీయ మీడియా ఛానెళ్లలో మాత్రం ఎయిర్ స్ట్రైక్స్ జరిగినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు ప్రసారమౌతున్నాయి.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*