
తెలంగాణ కాంగ్రెస్‌కు గట్టి షాక్… బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఆయనతో బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ చర్చలు జరిపారు. బీజేపీలోకి రమ్మని ఆహ్వానించారు. దీనికి ఆయన సమ్మతి కూడా తెలిపినట్లు సమాచారం.
మరోవైపు మంత్రి సర్వే సత్య నారాయణ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ మహేంద్రాహిల్స్‌లోని సర్వే సత్య నారాయణ ఇంటికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు
బండి సంజయ్ వెళ్లి ఆయన్ను బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. సంజయ్ వెంట పార్టీ సీనియర్ నేత వివేక్ కూడా సర్వేను కలిశారు. తాను బీజేపీలో చేరుతున్నానని సర్వే ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి బీజేపీలో చేరనున్నారు.
కోమటిరెడ్డి సోదరులు కూడా బీజేపీలో చేరతారని చాలాకాలంగా చర్చ జరుగుతోంది.
Be the first to comment