GHMC ఎన్నికల్లో బీజేపీ మేయర్ సీటు సాధించుకోవాలంటే ఎన్ని వార్డులు గెలవాలో తెలుసా?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూస్తుంటే వారికి కొంత అవగాహన అవసరం అనిపించింది.. అన్యధా భావించకండి.. జీహెచ్ఎంసీలో మొత్తం 150 వార్డులు ఉంటే 52 ఎక్స్ అఫిషియో ఓట్లు (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) ఉంటాయి.

అంటే మొత్తం సీట్లు 150+52=202 జీహెచ్ఎంసీ మేయర్ సీటు కావాలి అంటే 102 ఓట్లు కావాలి. జీహెచ్ఎంసీ పరిధిలో టీఆర్ఎస్‌కు 38 ఎక్స్ అఫిషియో ఉన్నాయి. ఆ పార్టీ మేయర్ సీటు సాధించాలి అంటే 64 వార్డులు గెలిస్తే సరిపోతుంది.

బీజేపీకి జీహెచ్ఎంసీ పరిధిలో 3 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. బీజేపీ మేయర్ సీటు సాధించుకోవాలి అంటే 99 వార్డులు గెలుచుకోవాలి.
జీహెచ్ఎంసీలో ఎంఐఎంకు 10, కాంగ్రెస్ కు 1 ఎక్స్ అఫిషియో సీట్లు ఉన్నాయి.

మొత్తం మీద చూస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ సీటు కోసం టీఆర్ఎస్ కన్నా బీజేపీ ఎక్కువ కష్టపడక తప్పదు. బీజేపీ అత్యధిక సీట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్ అందుకోకపోతే టీఆర్ఎస్ తన రహస్య స్నేహితుడు ఎంఐఎంతో కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లు పంచుకునే అవకాశం ఉంది.

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్స్ అఫిషియోలకు ఓటు హక్కు అనేది చాలా కాలంగా జరుగుతున్న అన్యాయం. ఇది ప్రజల తీర్పును వంచించడమే అవుతుంది.

జీహెచ్ఎంసీ ప్రజలు 150 కార్పొరేటర్లను ఎన్నుకుంటున్నారు. వీరంతా మేయర్ ను ఎన్నుకోవాలి.. కానీ వేరు మాత్రమే కూకుండా ఎక్స్ ఆఫీషియోల హోదాలో మరో 52 మంది ఓటు వేయబోతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ తన పరిధిలో 24 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అంటూ శాసనసభ సమావేశాల్లో పాల్గొని ఓటు వేయగలడా?. 4 లోక్ సభ సీట్లు తన పరిధిలో ఉన్నందున పార్లమెంట్ లో కూర్చుంటా అంటే కుదురుతుందా?.. మరి 52 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో భాగస్వాములను చేయడం న్యాయమేనా?

ఇది తొండాట కాదా?

Kranti Dev Mitra, journalist,Hyderabad.( 90000 01607 )

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*