జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కార్టూనిస్టుల సందడి

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్టూనిస్టులు కీలకంగా మారారు. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో ప్రధానభూమిక పోషిస్తున్నారు. నెట్టింట కార్టూన్లను నెటిజన్లు తెగ ఆదరిస్తున్నారు. హామీలిచ్చి నిలబెట్టుకోని పార్టీలను కార్టూనిస్టులు తమ కార్టూన్లలో ఉతికి ఆరేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు. లైక్‌లు, షేర్లతో సందడి చేస్తున్నారు. సులభంగా అర్ధమయ్యేలాగే కాకుండా హాస్యాన్ని కూడా జత చేసి కార్టూన్లు గీస్తున్న కార్టూనిస్టులను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

అలెక్సా పేరుతో ఓనావ విజృంభణ

స్మార్ట్‌ఫోన్‌లో హైదరాబాదీ యువత అడిగే ప్రశ్నకు సమాధానంగా వచ్చే సందేశాలు ఆకట్టుకుంటున్నాయి. లైక్‌లు, షేర్ల ప్రవాహం కొనసాగిస్తున్నాయి. ఓనావ పేరుతో జర్నలిస్ట్, కార్టూనిస్ట్ ఓం ప్రకాశ్ నారాయణ వడ్డీ వేస్తున్న కార్టూన్లు కితకితపెడుతున్నాయి. నవ్వు తెప్పిస్తున్నాయి.

ఓనావ నుంచి మరో కొత్త కార్టూన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని నెటిజన్లు ఎదురుచూసేలా చేయడంలో ఓనావ విజయవంతమయ్యారు.

Vaddi Omprakash Narayana

 

 

సునిశిత హాస్యానికి కేరాఫ్ అడ్రస్ పైడి

జర్నలిస్ట్, కార్టూనిస్ట్ పైడి శ్రీనివాస్ వేసే కార్టూన్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. చిన్న చిన్న గీతలతో పెద్ద పెద్ద సందేశాలిస్తున్నాయి. మొన్న దుబ్బాక ఎన్నికల్లోనూ పైడి శ్రీనివాస్ కార్టూన్లు ప్రకంపనలు సృష్టించాయి.

నేడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ కూడా పైడి కార్టూన్లు దుమ్మురేపుతున్నాయి. నేతలు ఓట్లడిగేటప్పుడు చేస్తున్న పనులను హాస్యం మేళవించి పైడి వేస్తున్న కార్టూన్లు చాలామంది నెటిజన్లకు స్టేటస్‌గా మారాయి.

 

 

https://www.facebook.com/pydiseenu

అయితే ప్రధాన పత్రికల్లో వచ్చే కార్టూన్లపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తమ యాజమాన్యాలు మద్దతిస్తున్న పార్టీలను గొప్పగా, మిగతా పార్టీలన్నీ చెత్తవిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పాతికేళ్లకు పైగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపిస్తున్న ప్రధాన పత్రికలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కార్టూన్లు గీస్తున్నాయని, అవి ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడం లేదని నెటిజన్లు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ప్రముఖ కార్టూనిస్టులుగా ఖ్యాతిగాంచిన వారు కూడా పప్పులో కాలేస్తూ ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ ఇతర పార్టీలను తక్కువ చేసి చూపిస్తూ పత్రికా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని నెటిజన్లు నేరుగా సోషల్ మీడియాలో ఉతికిఆరేస్తున్నారు. ఖ్యాతిగాంచిన ఆ కార్టూనిస్టులు తమ ఆత్మ ప్రభోధానుసారం కార్టూన్ గీస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించకుండా సంకుచిత మనస్తత్వంతో, తమ యాజమాన్యం ఇష్టపడే పార్టీలనే గొప్ప పార్టీలుగా చూపించడం తగదని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా కార్టూన్లు వేస్తూ పోతే ప్రజలకు ప్రధాన పత్రికలపై విరక్తిపుడుతుందని, దీంతో అసలుకే మోసం వస్తుందని ఆయా పత్రికల యాజమాన్యాలు గుర్తించాలని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*