బీజేపీ మ్యానిఫెస్టో హైలైట్స్ ఇవే!

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసింది.

హైదరాబాద్ వరద బాధితులందరికీ 25 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది.

జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని తెలిపింది.

అంతేకాదు ఎల్ ఆర్ ఎస్ రద్దు చేస్తామని ప్రకటించింది.

సెప్టంబర్ 17న విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని వెల్లడించింది.

125 గజాల లోపు ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు

గ్రేటర్‌లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ సేవలు

పేదలకు వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్

మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ సెంటర్లు

నగరంలో అతిపెద్ద తెలుగు గ్రంథాలయం ఏర్పాటు

మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్

గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు

గ్రేటర్‌లో ఇంటింటికి నల్లా కనెక్షన్..

24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా

కులవృత్తులకు ఉచిత విద్యుత్ ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ

గ్రేటర్‌లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ సేవలు

విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు,

వై-ఫై సౌకర్యం ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు

 

 

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేశారు.

 

 

 

 

కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్, డీకే అరుణ, బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*