“కళాపోషకులు” సినిమాలోని ఏలే ఏలే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసిన ఆర్పీ పట్నాయక్..!!

విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై చలపతి పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో ఏమ్. సుధాకర్ రెడ్డి నిర్మాత‌గా రూపొందిస్తున్న చిత్రం ‘కళాపోషకులు’. న‌టుడు జెమిని సురేష్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటోంది.. కాగా ఈ చిత్రంలోని ఏలే ఏలే లిరికల్ వీడియో సాంగ్ ని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ విడుదల చేసారు. హరిదేవ్ పాటల్ని రాయగా ఎలెందర్ మహావీర్ సంగీత సారథ్యం వహించారు.

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. కళాపోషకులు టైటిల్ చాలా క్యూరియాసిటీగా ఉంది.. టీజర్ చాలా బాగుంది. సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అన్నంత ఇంట్రెస్ట్ కలిగింది. ఏలే ఏలే సాంగ్ సూపర్బ్ గా ఉంది. హరిదేవ్ మంచి సాహిత్యం అందివ్వగా, ఏలెందర్ మ్యూజిక్ వండర్ ఫుల్ గా చేసాడు. రాహుల్ సిప్లిగంజ్ ఎక్సలెంట్ గా ఆలపించాడు. దర్శకుడు చలపతి నాకు బాగా పరిచయం.. ఆడియెన్స్ కి నచ్చేలా ఈ సినిమా తీసి ఉంటాడని టీజర్ చూస్తే తెలుస్తుంది. సుధాకర్ రెడ్డి మేకింగ్ గురించి చెప్పక్కర్లేదు.. అన్నింటిలో క్వాలిటీ కనిపిస్తుంది..ఈ సినిమా సక్సెస్ అయి టీం అందరికీ మంచి పేరు తీసుకు రావాలని.. అన్నారు.

ద‌ర్శ‌కుడు చలపతి పువ్వల మాట్లాడుతూ – ‘ నిర్మాత సుధాకర్ రెడ్డి గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించ‌డం వ‌ల్లే ఔట్‌పుట్ ఇంత‌బాగా వ‌చ్చింది. విశ్వకార్తికేయ మొద‌టి సినిమా అయినా చాలా బాగా న‌టించారు. ఆర్పీ పట్నాయక్ గారు మా చిత్రంలోని పాటని రిలీజ్ చేయడం వెరీ హ్యాపీ. ఎలెందర్ మంచి ట్యూన్స్ కంపోజ్ చేసాడు.. అన్నారు.

నిర్మాత ఏమ్. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ – ‘ దర్శకుడు చలపతి పువ్వల ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. కల్యాణ్ సమి కెమెరా వర్క్, ఎలెందర్ మహావీర్ మ్యూజిక్ సినిమాకు వన్ ఆఫ్ ది ఎస్సెట్ కానుంది. ఈ సినిమా త‌ప్ప‌కుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది..అన్నారు.

హీరో విశ్వకార్తికేయ మాట్లాడుతూ… నిర్మాత సుధాకర్ రెడ్డి గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు. చలపతి గారు మంచి కథతో ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక మంచి చిత్రం ద్వారా హీరోగా లాంఛ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా నాకు హీరోగా మంచి గుర్తింపు తెస్తుంది.. అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*