కోహెడ లో “నిన్ను చేరి” వెబ్ సిరీస్ షూటింగ్ సందడి

కోహెడ: తేజ హనుమాన్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై, శంకర్ కొప్పిశెట్టి నిర్మాతగా సాయి కృష్ణ తల్లాడ దర్శకత్వంలో తెరక్కెక్కిస్తున్న వెబ్ సిరీస్ “నిన్ను చేరి”. రాజు ఆనేం,మాధురి హిరో హీరోయిన్ గా , సీనియర్ నటులు గౌతమ్ రాజు,కిషోర్ దాస్, భద్రం, జబర్దస్త్ శాంతి స్వరప్ ,విలన్ గా శోభన్ బాబు భోగరాజు నటిస్తున్న నూతన వెబ్ సిరీస్ “నిన్ను చేరి”. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ని కోహెడ, పరిసర ప్రాంతాల్లో, వ్యవసాయ క్షేత్రంలో మొదలగు ప్రాంతాల్లో సోమవారం నుండి ప్రారంభించినట్లు వెబ్ సిరీస్ యూనిట్ తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత శంకర్ కొప్పిశెట్టి మాట్లాడుతూ…

డిస్ట్రిబ్యూటర్ గా నేను 140 సినిమాలు చేసాను, ప్రస్తుతం రైతుల వ్యవసాయానికి
లోన్స్ సరైన సమయంలో అందడం లేదు అనే కాన్సెప్ట్ తో, కమర్షియల్ యాంగిల్ గా పెద్ద పెద్ద నటి నటులను ఈ సిరీస్ లో పెట్టాం అని నిర్మాత శంకర్ తెలిపారు.

దర్శకుడు సాయి కృష్ణ తల్లాడ మాట్లాడుతూ…

కరోన నేపథ్యంలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలే కాకుండా, మధ్య తరగతి వ్యాపారులు, రైతులు కూడా కొన్ని ఆర్ధిక పరమైన సమస్యలు లాంటి అంశాలు, తొర్రుర్ కి చెందిన బాల నటి చైత్ర హాసిని తో చిన్నప్పటి అమ్మవారి వేష ధారన తో ఉన్న సన్నివేశాలు కథలో ఉండటం వలన ఈ కథకి అనుగుణంగా ఉండే లొకేషన్స్ కోసం మన తొర్రుర్,కోహెడ లాంటి ప్రాంతాలని షూటింగ్ కి ఎంచుకుని షూటింగ్ చేస్తున్నట్లు తెలిపారు.
హీరో రాజు ఆనేం,హీరోయిన్ మాట్లాడుతూ బ్యాంక్ చుట్టూ తిరిగే కథలో మేము నటిస్తున్నందుకు చాలా సంతోషoగా ఉందన్నారు.

టైటిల్ : నిన్ను చేరి,
బ్యానర్ :- తేజ హనుమాన్ ప్రొడక్షన్స్,
నిర్మాత :- శంకర్ కొప్పిశెట్టి,
దర్శకత్వం :- సాయి కృష్ణ తల్లాడ

టీం సభ్యులు కో డైరెక్టర్ : – జగదీష్,
అసోసియేట్ పవన్,అఖిల్,
కెమేరా మ్యాన్ :- శ్రీకాంత్,
అసోసియేట్ కేమెరా మాన్: రమేష్,
ప్రొడక్షన్ ఇంచార్జి : నరేందర్ కొండ,
మేకప్ అనిల్,పాషా, ప్రసాద్,నాగ సంతోష్

 

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*