కోవిడ్ వ్యాక్సిన్‌పై ప్రపంచ దేశాలికిచ్చిన మాట నిలబెట్టుకోనున్న భారత్

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోవిడ్ వ్యాక్సిన్ టూర్‌లో భాగంగా గుజరాత్‌ అహ్మదాబాద్‌లో ఉన్న జైడస్ బయోటెక్ పార్క్‌ను సందర్శించారు..

జైడస్ క్యాడిలా ఆధ్వర్యంలో తయారౌతున్న జైకోవిడ్  కోవిడ్ వ్యాక్సిన్ తయారీ, పురోగతి గురించి శాస్త్రవేత్తలతో చర్చించారు.

వ్యాక్సిన్ రూపొందించడంలో కృషి చేసిన శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి అభినందించారు. ప్రభుత్వం అన్ని విధాలా సాయమందిస్తుందని హామీ ఇచ్చారు.

ఆ తర్వాత మోదీ హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌ను సందర్శించారు. శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు.

కోవ్యాగ్జిన్ తయారీ, పురోగతిపై శాస్త్రవేత్తలతో సమీక్ష జరిపారు. భారత్ బయోటెక్ ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి కోవ్యాగ్జిన్ రూపొందిస్తోంది.

 

అనంతరం ప్రధాని హైదరాబాద్ నుంచి పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సందర్శించి వ్యాక్సిన్ తయారీ, పురోగతిని సమీక్షించారు. సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ ప్రక్రియలపై స్వయంగా శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.

ప్రపంచ దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు భారత్ కృషి చేస్తుందని ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రకటించారు. మోదీ ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్‌తో పాటు ప్రపంచ దేశాధినేతలు కూడా స్వాగతించారు.

ప్రపంచదేశాలికిచ్చిన హామీని నెరవేర్చడంలో భాగంగా ప్రధాని ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ తయారీ, అభివృద్ధిపై సమీక్ష జరుపుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు వ్యాక్సిన్లు భారత్‌లో సిద్ధమౌతున్నాయి. ఫిబ్రవరి రెండోవారానికిల్లా భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ సిద్ధమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తొలుత కోవిడ్ వారియర్స్‌ అయిన వైద్య సిబ్బంది, పోలీస్, రక్షణ విభాగాలకు అనంతరం దేశ ప్రజలందరికీ దశల వారీగా వ్యాక్సిన్ ఇస్తారు. ఇందుకోసం కేంద్రం దాదాపు వెయ్యి కోట్లు మంజూరు చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*