
హైదరాబాద్: నూతన దర్శకుడు శ్రీవర్ధన్ రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఐఐటీ కృష్ణ మూర్తి అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. పృథ్వీ దండమూడి, మైరా దోషి జంటగా నటించారు. క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్, అక్కి ఆర్ట్స్ బ్యానర్లపై మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో పారిశ్రామికవేత్త ప్రసాద్ నేకూరి ఈ సినిమాను నిర్మించారు. ఐఐటీ కృష్ణ మూర్తి టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్లో ప్రముఖ దర్శకుడైన హరీశ్ శంకర్ ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశారు. 20 లక్షలకు పైగా హిట్స్ వచ్చాయి.
కమెడియన్ సత్య, బెనర్జీ, వినయ్ వర్మ తదితరులు ఐఐటీ కృష్ణ మూర్తి సినిమాలో కీలక పాత్రలు పోషించారు. నరేశ్ కుమారన్ మ్యూజిక్ అందించారు.
Be the first to comment