రివ్యూ: ‘బాలమిత్ర

రివ్యూ: ‘బాలమిత్ర’

మూవీ

నేమ్‌: ‘బాలమిత్ర’

 

విడుదల తేది: 2021, ఫిబ్రవరి 26

 

నటీనటులు: రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ తదితరులు

 

సంగీతం: జయవర్ధన్,

సినిమాటోగ్రఫీ: రజిని,

ఎడిటర్: రవితేజ,

 

ఆర్ట్: భీమేష్,

 

నిర్మాతలు: శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్,

 

కథ, దర్శకత్వం: శైలేష్ తివారి.

 

 

తెలుగు సినిమా ఈ మధ్య ప్రయోగాలకు నిలయంగా మారింది. పక్కా కమర్షియల్ పంథా నుంచి కొంత విరామం తీసుకుని ప్రయోగాత్మక సినిమాల వైపు మళ్లుతోంది. అందులోనూ ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌ సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తి పెరుగుతోంది. ఈ జోనర్‌లో తీసిన సినిమాలను ప్రేక్షకులు కూడా ఆదరిస్తుండడంతో దర్శక నిర్మాతలు కూడా ఈ తరహా చిత్రాలపై మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో అదే జోనర్లో విడుదలైన చిత్రం బాలమిత్ర.

 

 

 

స్టోరీ:

 

కథానాయకుడు అర్జున్‌(రంగా) ఓ వైద్య విద్యార్థి. తన క్లాస్‌మేట్‌ దీక్ష(కియా)ని ప్రేమిస్తాడు. అయితే అతడి ప్రేమను నమ్మని దీక్ష తిరస్కరిస్తుంది. కానీ తరువాత అతడి ప్రేమలోని నిజాయితీని గ్రహించిన దీక్ష కూడా తిరిగి ప్రేమిస్తుంది. ఇక్కడి వరకు మంచ లవ్‌స్టోరీగా సాగిన సినిమా ఉన్నట్లుండి ఓ సూపర్ ట్విస్ట్ తీసుకుంటుంది. దీక్ష ఉన్నట్లుండి కిడ్నాప్ అవుతుంది. కిడ్నాపర్లు అర్జున్‌కి ఫోన్‌ చేసి.. ముగ్గురిని చంపితేనే దీక్షని వదులుతామని బెదిరిస్తారు. కిడ్నాపర్ల మాట ప్రకారం.. వారు చెప్పినవారిలో ఇద్దరిని చంపేసిన అర్జున్‌.. కొన్ని రోజులు కనిపించకుండా ఉండేందుకు ఓ గ్రామం వెళతాడు. అక్కడ బాల అనే వ్యక్తికి స్నేహితుడిగా తనను తాను పరిచయం చేసుకుంటాడు. అయితే బాల చెల్లెలు వైశాలి అర్జున్‌ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అసలు దీక్ష కిడ్నాప్‌ ఎందుకు అవుతుంది? బాల ఎవరు? వైశాలి ఫ్యామిలీకి అర్జున్‌ చేసే హత్యలకు సంబంధం ఏమిటి? అనే విషయాల చుట్టూ ఈ కథలోని అసలు సస్పెన్స్ ఉంటుంది.

 

 

 

కాస్టింగ్ స్టాండర్డ్స్:

 

 

హీరో అర్జున్‌ లుక్స్ వైజ్‌గా చక్కగా ఉన్నాడు. హీరో క్వాలిటీస్‌ చక్కగా కనిపించాయి. అతడి నటనకు కూడా మంచిమార్కులే వేయవచ్చు. అతనికిది రెండో చిత్రమే అయినా.. ఎక్కడా అలాంటి ఫీలింగ్‌ రానివ్వకుండా మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ హీరోలా నటించాడు. లవర్‌గానూ, అలాగే తాను చేస్తున్న హత్యల వెనకున్న వారెవరో కనుక్కునేందుకు ప్రయత్నించే వ్యక్తిగా చక్కటి నటన కనబరిచాడు. హీరోయిన్లలో కియా రెడ్డి గ్లామర్‌గా కాసేపు కనిపించింది. అలాగే కథలో మెయిన్‌ పాత్రధారిగా కూడా ఆమె నటన బాగుంది. బాల త్రిపుర సుందరి పాత్రలో చేసిన అమ్మాయి క్యూట్‌గా సమాజం కోసం తాపత్రయపడే పాత్రలో నటన పరంగా మంచి మార్కులే కొట్టేసింది. చిత్రానికి మెయిన్‌ ట్విస్ట్ ఇచ్చే వైశాలి పాత్ర చిత్రీకరణ చాలా బాగుంది. అలాగే వైశాలిగా చేసిన అమ్మాయి పల్లెటూరి అమ్మాయిగా, పగబట్టిన వనితగా రెండు పాత్రలను అద్భుతంగా పోషించింది. హీరో ఫ్రెండ్స్‌‌ పాత్రలతో చేయించిన కామెడీ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి. తండ్రి పాత్రలో దయానందరెడ్డి చక్కటి నటనను కనబరిచారు. మిగతా పాత్రలన్నీ కథకు అనుగుణంగా నడిచాయి.

 

 

 

టెక్నికల్ స్టాండర్డ్స్:

 

ఈ సినిమాకి సంగీతం, సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా రెండు పాటలు, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో సంగీత దర్శకుడు మెప్పించాడు. తండ్రీ కూతుళ్ల బంధం తెలిపే పాటతో పాటు హీరో ఓరియెంటెడ్‌గా సాగే వెళ్లిపోమాకే పాటలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్‌, ఆర్ట్ వర్క్‌ పరవాలేదనిపించాయి. సినిమా నిర్మాణం కూడా చాలా రిచ్‌గా ఉంది. కథను నమ్మి నిర్మాత ఖర్చు పెట్టినట్లు అనిపిస్తుంది. ఇక దర్శకత్వం గురించి చెప్పాలంటే ఫస్టాఫ్‌ నెమ్మదిగా నడిచినా.. సెకండాఫ్‌ మాత్రం ట్విస్ట్‌లతో దర్శకుడు చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచాడు. సరైన క్లైమాక్స్‌తో చిత్రాన్ని ముగించాడు.

 

 

 

అనాలసిస్:

 

దర్శకుడు తను చెప్పాలనుకున్న కథకి, సస్పెన్స్‌ జోడించి థ్రిల్లర్‌గా మార్చి బాగా తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌ అంతా హీరో, హీరోయిన్‌ల ప్రేమని హైలెట్‌ చేసి, సెకండాఫ్‌లో మెయిన్‌ కథని నడిపించాడు. ఎందుకు చంపుతున్నాడో తెలియని హీరోకి.. ఆ కారణం తెలియజేసే ట్విస్ట్‌ ప్రేక్షకులకు నచ్చుతుంది. అలాగే ‘అతడు’ తరహాలో హత్యలు చేసిన హీరో కొన్ని రోజులు కనిపించకుండా ఉండడానికి ఆ హత్యలకు కారణమైన ఫ్యామిలీ ఇంటికే చేరడం, ఆ విషయం రివియల్ కాగానే ప్రేక్షకుడు చాలా థ్రిల్‌గా ఫీల్ అవుతాడు. ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే హైలెట్‌గా చెప్పుకోవచ్చు. అలాగే ప్రతీ పాత్రకి, ఆఖరికి చిన్న బుడతడి పాత్రతో కూడా దర్శకుడు కామెడీ చేయించాడు. మనిషికి ఆశయమే కాదు.. దానికి తగిన ఆలోచన కూడా ఉండాలని, అది ఉన్నతంగా ఉండాలని దర్శకుడు చెప్పిన విధానం ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుంది. ఫస్టాఫ్‌ చూసి ఎవరైనా విసుక్కున్నా.. సెకండాఫ్‌లో మాత్రం ట్విస్ట్‌లతో గొప్పగా ఫీల్ అవుతాడు. క్లైమాక్స్‌ కూడా నచ్చుతుంది. సినిమా అయిపోయాక ప్రతి ప్రేక్షకుడూ థియేటర్‌ నుంచి సంతృప్తిగా బయటికి వస్తాడు. ఓవరాల్‌గా దర్శకుడు చెప్పాలనుకున్న మెయిన్‌ విషయం ఆడియన్‌కి బాగా కనెక్ట్ అవుతుంది.

 

 

 

ట్యాగ్‌లైన్‌: ఆశయం కోసం మంచి మార్గం ఎన్నుకోవాలని చెప్పే చిత్రమిది

 

రేటింగ్‌: 3.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*