
తిరువనంతపురం: కేరళ అలప్పుజా జిల్లా వాయలార్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముఖ్య శిక్షక్ నందు ఆర్ కృష్ణ దారుణ హత్యకు గురయ్యారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎస్డీపీఐ) కార్యకర్తలు ఈ హత్యకు పాల్పడినట్లు అలప్పుజా పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించి ఏడుగురు ఎస్డీపీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నందు హత్య నేపథ్యంలో బీజేపీ అలప్పుజా జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు పలు హిందూ సంఘాలు మద్దతునిచ్చాయి.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేరళ కాజర్‌గోడ్ నుంచి తిరువనంతపురం వరకు విజయ్ యాత్ర నిర్వహించనున్నారు. దీనికి వ్యతిరేకంగా ఎస్డీపీఐ ఆందోళనలు చేపట్టింది. ఈ ఆందోళనలను తిప్పికొడ్తూ స్వయం సేవక్‌లు చేపట్టిన ర్యాలీపై ఎస్డీపీఐ కార్యకర్తలు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు స్వయం సేవకులు గాయపడ్డారు.
Be the first to comment