నా విజయం వెనుక స్వామి వివేకానంద ఉన్నాడు: సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్

హైదరాబాద్: సాయం కోసం ఆర్జించేవారికి చేతనైన సాయం చేయడమే నిజమైన హీరోయిజమని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. నేరరహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి విద్యార్ధీ పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్‌లో వందేమాతరం యూత్ ఫ్రంట్ నిర్వహించిన వివేకోత్సవం-2021 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్ధులను, యువతను ఉద్దేశించి మాట్లాడారు. చట్టాల్ని అనుసరిస్తూ నియమాల్ని పాటించే వారే తన దృష్టిలో నిజమైన హీరో అని చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయడం సరికాదని సూచించారు. ఈజీ మనీకి అలవాటుపడటం మంచిదికాదని చెప్పారు. అతిగా సోషల్ మీడియాపై ఆధారపడవద్దని హెచ్చరించారు. తన విజయం వెనుక వివేకానంద ఉన్నాడని సజ్జనార్ చెప్పారు. తాను స్వామి వివేకానంద ఉపన్యాసాలు, సాహిత్యం నుంచి స్ఫూర్తి పొందానని చెప్పారు. దేశం సూపర్ పవర్‌గా ఎదగాలంటే యువశక్తే ఇంధనమని సజ్జనార్ చెప్పారు.

https://www.youtube.com/watch?v=MmPb9HAJKlg

వందేమాతరం యూత్ ఫ్రంట్ ప్రతినిధి జగదీశ్ మాట్లాడుతూ కరోనాకు వ్యాక్సిన్ కనుగొని 60 దేశాలకు పంపిణీ చేసిన మోదీ సర్కారును ప్రతి ఒక్కరూ ప్రశంసించాలన్నారు. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలు మోదీ సర్కారును మెచ్చుకుంటున్నాయని గుర్తు చేశారు.

 

వివేకోత్సవంలో భాగంగా విద్యార్ధులకు సింగింగ్, డ్యాన్సింగ్ క్రియేటివ్ కాంటెస్ట్, వ్యాసరచన, వక్తృత్వ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు ప్రైజులు అందించారు. కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యంగా రాణి రుద్రమదేవి ఏక పాత్రాభినయం ఆకట్టుకుంది. విద్యార్ధిని చెప్పిన డైలాగ్‌లకు సభ హోరెత్తింది. విద్యార్ధులు, ప్రతినిధుల ప్రసంగాలు స్ఫూర్తి నింపాయి. హైదరాబాద్ నగరంలోని వివిధ కాలేజీలనుంచి వందలాది మంది విద్యార్ధినీ విద్యార్ధులు వివేకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వందేమాతరం ప్రతినిధులు కల్నల్ శ్రీనివాస్, సచిన్, రాజశేఖర్ రెడ్డి, ప్రియంక తదితరులు పాల్గొన్నారు.

 

విద్యార్ధుల్లో స్ఫూర్తి నింపేలా చక్కటి కార్యక్రమం నిర్వహించిన వందేమాతరం యూత్ ఫ్రంట్‌ను అభినందించి తీరాల్సిందే.

♦ Subscribe VMYF Vande Mataram Youth Front Youtube Channel
https://www.youtube.com/channel/UCZMG​…

♦ Vande Mataram Youth Front Facebook page:
https://www.facebook.com/VandeMataram​…

♦ Follow Vande Mataram Youth Front Twitter
https://twitter.com/VmyfHeadoffice​

♦ Vande Mataram Youth Front Instagram:
https://www.instagram.com/vmyf/?hl=en​

♦ E-mail Us: vmyf.headoffice@gmail.com

♦ visit our website: www.vmyf.org

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*