
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నిర్వహించిన వ్యాసరచన పోటీలో హైదరాబాద్కు చెందిన రమేష్ సోమిశెట్టి బహుమతి గెలుచుకున్నారు. టెక్ మహీంద్రాలో జరిగిన కార్యక్రమంలో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మన్సి జోషి చేతులమీదుగా ఆయన ఈ అవార్డ్ అందుకున్నారు. చూజ్ టు ఛాలెంజ్ పేరిట వర్చువల్ విధానంలో జరిగిన ఈ కాంపిటీషన్లో అన్ని వయసుల వారు పాల్గొన్నారు. మూడు విభాగాల్లో విజేతలను ప్రకటించారు. పది ప్రత్యేక కన్సొలేషన్ బహుమతులు కూడా ప్రకటించారు. విజేతలకు క్యాష్ అవార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు.
https://www.facebook.com/ramesh.somisetty/posts/10208642627299146
మహిళల భద్రత, గౌరవం, సమానత్వంపై హృదయానికి హత్తుకునేలా రాసిన రమేశ్ సోమిశెట్టి విజేతల్లో ఒకరిగా నిలిచారు.
Be the first to comment