ఘనంగా స్నాతకోత్సవం

హైదరాబాద్: పానినీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసర్చ్ సెంటర్ స్నాతకోత్సవం హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లో ఘనంగా జరిగింది. వైస్ ఛాన్సలర్ జీఎస్ కోహ్లీ, ప్రిన్సిపాల్ డాక్టర్ కరుణాకర్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు మెడల్స్‌తో పాటు సర్టిఫికెట్లు అందించారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి విద్యార్ధుల కుటుంబసభ్యులను అనుమతించలేదు.

 

మరోవైపు మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (కంజర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్‌)లో డాక్టర్ హిషత్ జైదీకి మెడల్‌తోపాటు సర్టిఫికెట్ దక్కింది. దీనిపై ఆమె తల్లి డాక్టర్ నజాఫి బేగం హర్షం వ్యక్తం చేశారు. సరోజినీ కంటి ఆసుపత్రిలో ఆమె ఆర్ఎంఓగా పనిచేస్తున్నారు. కుమార్తెలను గొప్ప చదువులు చదివించాలన్నారు. ఉన్నత చదువులు అందించడం ద్వారా వారి ఉన్నతికి సహకరించాలని సూచించారు. విద్య ద్వారా వచ్చే శక్తిని కుమార్తెలకు అందించాలని డాక్టర్ నజాఫి బేగం తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా బేటీ బచావో- బేటీ పడావో అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నినాదాన్ని అక్షరాలా ఆచరించి చూపారు డాక్టర్ నజాఫి బేగం. తమ కుమార్తెకు ఉన్నత చదువులందించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*