వివేకానంద డే క్యాంపెయిన్‌కు అనూహ్య మద్దతు

హైదరాబాద్: 1893 ఫిబ్రవరిలో స్వామి వివేకానంద హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ప్రసంగించిన ఫిబ్రవరి 13ను వివేకానంద డేగా గుర్తించి ప్రభుత్వమే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలన్న క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన వస్తోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో యువత సంతకాల సేకరణ చేపట్టింది. ఆన్‌లైన్ పిటిషన్ ద్వారా కూడా మద్దతు కూడగడుతోంది. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో మీడియా సంస్థలు, జర్నలిస్టులు క్యాంపెయిన్‌కు మద్దతు పలికారు.

https://sites.google.com/view/vivekanandasandarshanam/home

నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఇంగ్లీష్ డైలీ, టీ న్యూస్, తెలంగాణ ప్రభుత్వ అధికార మాస పత్రిక తెలంగాణ, ఎన్‌టీవీ, టెన్ టీవీ సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు, ఎఫ్ రెయిన్ బో, రేడియో సిటీలో పనిచేసే రేడియో జాకీలు క్యాంపెయిన్‌కు మద్దతు ప్రకటించారు. స్వామి వివేకానంద పోస్టర్లపై సంతకాలు చేశారు.

https://www.facebook.com/kranthi.bhushan.31/posts/4212742845419880

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కూడా క్యాంపెయిన్‌కు మద్దతు పలికారు. తెలంగాణ అసెంబ్లీలో తాను ఫిబ్రవరి 13ను వివేకానంద డేగా గుర్తించాలనే అంశాన్ని ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. క్యాంపెయిన్‌కు మద్దతుగా స్వామి వివేకానంద పోస్టర్‌పై సంతకం చేశారు.

 

లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ వివేకానంద డే క్యాంపెయిన్‌కు మద్దతు పలికారు.

 

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా క్యాంపెయిన్‌కు మద్దతిచ్చారు.

https://www.facebook.com/kranthi.bhushan.31/posts/4235728459787985

సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, బాలాపూర్ డీసీపీ పద్మజ, హైదరాబాద్ పోలీస్ అకాడెమీ‌కి చెందిన అడిషనల్ డీసీపీ మద్దిపాటి శ్రీనివాసరావు తదితరులు వివేకానంద డే క్యాంపెయిన్‌కు మద్దతు పలికారు.

https://www.facebook.com/kranthi.bhushan.31/posts/4235744489786382

మంజీరా గ్రూప్ సీఎండీ యోగానంద్ గజ్జల కూడా వివేకానంద డే క్యాంపెయిన్‌కు మద్దతు తెలిపారు.

https://www.facebook.com/kranthi.bhushan.31

హైదరాబాద్‌లోని వివిధ విద్యా సంస్ధలు ఇప్పటికే వివేకానంద డే క్యాంపెయిన్‌కు మద్దతిచ్చాయి.

https://www.facebook.com/kranthi.bhushan.31/posts/4243176335709864

https://www.facebook.com/kranthi.bhushan.31/posts/4224063157621182

రామకృష్ణ మఠం వాలంటీర్లు తెలంగాణలోని నలుమూలలకూ ఈ క్యాంపెయిన్‌ను తీసుకెళ్తున్నారు. ప్రజా మద్దతు కూడగడుతున్నారు.

https://www.facebook.com/kranthi.bhushan.31/posts/4235732779787553

స్వామి వివేకానంద హైదరాబాద్‌లో పర్యటించడం భాగ్యనగర వాసులందరికీ గర్వకారణమని హైదరాబాద్ యూత్ అంటోంది.

 

వివేకానంద సందర్శనం పేరుతో రూపొందించిన ఆన్‌లైన్ పిటిషన్ ద్వారా వివేకానంద అభిమానులు తమ మద్దతు తెలియజేయవచ్చునని వాలంటీర్లు సూచిస్తున్నారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*