వివేకానంద డే క్యాంపెయిన్‌కు కృషిభారతం మద్దతు 

హైదరాబాద్: 1893 ఫిబ్రవరిలో స్వామి వివేకానంద హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ప్రసంగించిన ఫిబ్రవరి 13ను వివేకానంద డేగా గుర్తించి ప్రభుత్వమే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలన్న క్యాంపెయిన్‌కు కృషి భారతం మద్దతు ప్రకటించింది. యువతలో ఆత్మ విశ్వాసాన్ని నింపి దేశాన్ని పునరుద్ధరింపచేసేందుకు తనను తాను అర్పించుకున్న స్వామి వివేకానంద పాద స్పర్శతో హైదరాబాద్ పవిత్రభూమిగా మారిపోయిందని కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ (86867 43452) తెలిపారు. స్వామి వివేకానంద భాగ్యనగరంలో పర్యటించారనే విషయం కొందరికే తెలుసని, ఈ విషయాన్ని మరింత మందికి తెలిసేలా చేయాలన్నారు. చికాగో నగరంలో జైత్రయాత్ర కొనసాగించేందుకు స్వామి వివేకానందకు హైదరాబాద్ పర్యటన దోహదపడిందని నాటి చరిత్రకారులు రాసిన విషయాల ద్వారా తెలుస్తోందని కౌటిల్య చెప్పారు. స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటన తెలుగువారంతా గర్వించదగ్గ విషయమన్నారు. కృషి భారతం తరపున దేశ వ్యాప్తంగా వేద వ్యవసాయం చేస్తున్న తమ వాలంటీర్లు, రైతులు వివేకానంద డే క్యాంపెయిన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తారని వెల్లడించారు. ఫిబ్రవరి 13ను తెలంగాణ ప్రభుత్వం వివేకానంద డే గా గుర్తించేవరకూ తాము క్యాంపెయిన్‌కు మద్దతుగా నిలుస్తామని కౌటిల్య కృష్ణన్ హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల రైతాంగానికి కూడా తాము వివేకానంద డే క్యాంపెయిన్ గురించి వివరిస్తామని చెప్పారు. రైతు సంఘాల మద్దతు కూడా కూడగడతామని చెప్పారు.

https://sites.google.com/view/vivekanandasandarshanam/home

మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో యువత సంతకాల సేకరణ చేపట్టింది. ఆన్‌లైన్ పిటిషన్ ద్వారా కూడా మద్దతు కూడగడుతోంది. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో మీడియా సంస్థలు, జర్నలిస్టులు క్యాంపెయిన్‌కు ఇప్పటికే మద్దతు పలికారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఇంగ్లీష్ డైలీ, టీ న్యూస్, తెలంగాణ ప్రభుత్వ అధికార మాస పత్రిక తెలంగాణ, ఎన్‌టీవీ, టెన్ టీవీ సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు క్యాంపెయిన్‌కు మద్దతు ప్రకటించారు. స్వామి వివేకానంద పోస్టర్లపై సంతకాలు చేశారు.

 

http://bit.ly/vivekanandasandarshanam

 

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కూడా క్యాంపెయిన్‌కు మద్దతు పలికారు. తెలంగాణ అసెంబ్లీలో తాను ఫిబ్రవరి 13ను వివేకానంద డేగా గుర్తించాలనే అంశాన్ని ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. క్యాంపెయిన్‌కు మద్దతుగా స్వామి వివేకానంద పోస్టర్‌పై సంతకం చేశారు.

 

https://www.facebook.com/svinhyd

 

లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ వివేకానంద డే క్యాంపెయిన్‌కు మద్దతు పలికారు.

 

 

 

 

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా క్యాంపెయిన్‌కు మద్దతిచ్చారు.

 

 

 

మంజీరా గ్రూప్ సీఎండీ యోగానంద్ గజ్జల కూడా వివేకానంద డే క్యాంపెయిన్‌కు మద్దతు తెలిపారు.

 

 

 

హైదరాబాద్‌లోని వివిధ విద్యా సంస్ధలు ఇప్పటికే వివేకానంద డే క్యాంపెయిన్‌కు మద్దతిచ్చాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*