అన్నదాతల ఆదాయం రెట్టింపు చేసే కౌటిల్యుడి సలహాలు… డోంట్ మిస్ 

అన్నదాతల ఆదాయం రెట్టింపు చేసే కౌటిల్యుడి సలహాలు… డోంట్ మిస్

 

హైదరాబాద్: వేద వ్యవసాయం ద్వారా కృష్ణ వ్రీహీ( నల్ల బియ్యం) పండిస్తోన్న కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ ( 86867 43452) అన్నదాతల ఆదాయం రెట్టింపయ్యే సలహాలిస్తున్నారు. అత్యంత ఆరోగ్యకరమైన ఆహారంగా పేరుగాంచిన భారతీయ వరి వంగడం కృష్ణ వ్రీహీ( నల్ల బియ్యం) ద్వారా రైతన్నల ఆదాయం పెరగడమే కాక అన్నదాతల ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుందని చెప్పారు. అన్నదాతలు ఆరోగ్యంగా ఉండటం కోసం కృష్ణ వ్రీహీ పండించి ఆహారంగా తీసుకోవాలని, తద్వారా తమతో పాటు తమ కుటుంబ సభ్యులూ ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రైతులు తమ పొలాల్లో కొంత మేర కృష్ణ వ్రీహీ పండించుకోవాలని ఆయన సలహా ఇస్తున్నారు. తమ కుటుంబాలకు సరిపోగా మిగిలిన నల్లబియ్యాన్ని మార్కెట్‌లో అమ్ముకుని భారీగా లాభాలు గడించవచ్చని కౌటిల్య చెబుతున్నారు. నల్ల బియ్యానికి విదేశాలతో పాటు భారత్‌లోనూ అమ్మకాలు పెరుగుతున్నాయని చెప్పారు. జర్నలిస్ట్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కౌటిల్య కృష్ణన్ పలు కీలక సూచనలు చేశారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*