
అచ్చు మీలాగే
మిమ్మల్ని పోలినట్టే ఉండే
బొమ్మలను చూసారా?
మీ పెళ్లి, శ్రీమంతం, షష్ఠి పూర్తిలో
మీలాంటి డ్రెస్సులతో
మీ డూప్ లాగా ఉండే బొమ్మలను
చూడాలనుకుంటున్నారా??
అయితే మనం పల్లవి గారిని కలుసుకోవాలి. అందమైన బొమ్మలను మనం కోరినట్టు తయారు చేయడం పల్లవి ప్రత్యేకత.
https://www.facebook.com/permalink.php?story_fbid=1152368978528187&id=449830185448740
నమస్తే పల్లవి గారు
నమస్తే
మీరు ఎక్కడ ఉంటారు?
హైదరాబాద్
మీకు బొమ్మలను ఇలా తయారుచేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
ఈ ఆసక్తి చిన్నప్పటి నుంచి ఉంది. వాడేసిన నూనె డబ్బాలకు చిన్న చిన్న దుస్తులు చుట్టి అందమైన గోపికగా మార్చేదాన్ని. ప్లాస్టిక్ బొమ్మలకు నేనే డ్రెస్సెస్ కుట్టి అందంగా తయారుచేసి ఆడుకునేదాన్ని. ఆ తర్వాత సాఫ్ట్ టాయ్స్ చేయడం ఇలా.
https://www.facebook.com/permalink.php?story_fbid=1197654943999590&id=449830185448740
మీ హాబీ ప్రొఫెషన్ గా ఎప్పుడు మారింది?
మూడేళ్ళ క్రితం. ఓసారి ఇలాగే బొమ్మలు చేసి పెడితే నా కజిన్ చాలా బాగున్నాయి తనకు అమ్మమంది. ఈ ఐడియా బాగుందని అప్పటి నుంచి డాల్స్ మేకింగ్ ప్రొఫెషన్ చేసుకున్నాను.
ప్రస్తుతం ఇదే మీ కెరీర్ గా మలచుకున్నారు కదా… రెస్పాన్స్ ఎలా ఉంది?
చాలా బాగుంది. సోషల్ మీడియాలో ఎంతోమంది బొమ్మలు బాగున్నాయంటూ మెసేజులు పెడుతుంటారు. ఆర్డర్స్ చేస్తుంటారు.
https://www.facebook.com/permalink.php?story_fbid=1193104151121336&id=449830185448740
మీ బొమ్మల గురించి…
నేను ఎక్కువగా చేసేది రెప్లిక అంటే మనుషులను పోలిన బొమ్మలు. ఇంకా సాధారణ మహిళలు ఎలా ఉంటారో అవి ఎక్కువగా చేస్తాను. సో కస్టమర్స్ వాళ్ళను వాళ్ళు బొమ్మలలో చూసుకుంటారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు.
ఇప్పటి వరకూ ఏమేమి రెప్లికాస్ చేసారు?
ఆర్డర్ పైన శ్రీమంతం, ఎంగేజ్మెంట్, షష్ఠి పూర్తి ఇలా చాలానే. ముందుగానే కస్టమర్స్ వారు వేసుకునే డ్రెస్ కలర్స్ గానీ ఫొటోస్ గానీ ఇస్తే అచ్చు గుద్దినట్టు అలానే బొమ్మలను తయారు చేసి ఇస్తుంటాను. ఇవి గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి.
https://www.facebook.com/permalink.php?story_fbid=1184597498638668&id=449830185448740
ఇప్పటి వరకూ మీరు చేసిన వాటిల్లో మీకు బాగా నచ్చిన బొమ్మ?
అన్ని బొమ్మలు నచ్చుతాయి. ప్రతీది ఒక కొత్త టాస్క్ లాంటిది నాకు.
మీరు దేవతామూర్తుల బొమ్మలు కూడా చాలా బాగా చేస్తారు
థాంక్యూ. నాకు మంచి పేరు తెచ్చాయి దేవుడి బొమ్మలు
మీకు మంచి పేరు తెచ్చిన బొమ్మ
తమిళనాడులో గర్భరక్షాంబిక అమ్మవారి ఆలయం ఉంది. ఆ దేవి బొమ్మను నేను తయారుచేసాను. నాలుగు చేతులతో ఎంతో ప్రసన్నంగా ఉండే ఆ అమ్మ బొమ్మకు చాలామంది కంప్లిమెంట్స్ ఇచ్చారు. మరో ప్రత్యేకత ఏంటంటే నా బొమ్మలు వెనక నుంచి చూసినా ముచ్చటగా ఉంటాయి
https://www.facebook.com/permalink.php?story_fbid=1110331312731954&id=449830185448740
మీ దగ్గర ఎప్పటికి భద్రంగా దాచుకోవాలి అనుకుంటున్న బొమ్మ
ప్రతి బొమ్మ నా దగ్గరే పెట్టేసుకోవాలి అనిపిస్తుంది. కానీ అలా కుదరదు కదా.
https://www.facebook.com/permalink.php?story_fbid=1119046585193760&id=449830185448740
ఎవరైనా ఆర్డర్ చేయాలంటే?
నాకు ఫేస్ బుక్ పేజీలు ఉన్నాయి. Pallavi Chandramukhi, Pallavi Collections అక్కడ మెసేజ్ చేస్తే చాలు.
https://www.facebook.com/Pallavi-Collections-449830185448740/
బొమ్మలు కాకుండా ఇంకేం చేస్తుంటారు?
చాలానే. పెయింటింగ్స్ వేస్తుంటాను. డాన్స్, డిజైనర్ డ్రెస్సెస్, టెర్రెస్ గార్డెనింగ్ చాలా ఇష్టం.
మా కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలు
మంజీత కుమార్, ఈక్షణం ఫీచర్స్ ఇంఛార్జ్.
https://www.facebook.com/manjeetha.bandeela/posts/10224296245460931
https://www.facebook.com/manjeetha.bandeela/posts/10224349390549525
https://www.facebook.com/manjeetha.bandeela/posts/10224190800064862
https://www.facebook.com/manjeetha.bandeela/posts/10224087609485162
https://www.facebook.com/manjeetha.bandeela/posts/10224043897672394
https://www.facebook.com/manjeetha.bandeela/posts/10223760873796974
https://www.facebook.com/manjeetha.bandeela/posts/10223696571229450
Be the first to comment