నిన్ను చేరి వెబ్ సిరీస్ లోగో లాంచ్ చేసిన డైరెక్టర్ వి.వి.వినాయక్

హైదరాబాద్: తేజా హనుమాన్ ప్రోడక్షన్స్ బ్యానర్ పైన రాజు ఆనేం, మాధురి హీరో హీరోయిన్లు గా గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోరో దాసు నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న వెబ్ సిరీస్ ” నిన్ను చేరి”. సాయికృష్ణ తల్లాడ డైరెక్టర్ గా చేస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా ఈ సిరీస్ టైటిల్ లుక్ ని ప్రముఖ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ శంకర్ డిస్ట్రిబ్యూటర్ గా చిత్ర పరిశ్రమలో సుపరిచితుడు, ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుతున్న సందర్భంగా వారికి , నిన్ను చేరి టీం కి శుభాకాంక్షలు తెలిపారు.

నిర్మాత శంకర్ కొప్పిశెట్టి మాట్లాడుతూ ఇప్పటి వరకు 175 సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ గా చేసాను, ఇప్పుడు నిర్మాతగా మారి నిన్ను చేరి అనే వెబ్ సిరీస్ ని నిర్మించాను, ఈ సిరీస్ లోగోని మా అన్నయ్య వి.వి.వినాయక్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది, అలానే మా డైరెక్టర్ సాయికృష్ణ అండ్ మా టీం బాగా కష్ట పడి మంచిఅవుట్ ఫుట్ వచ్చేలా ఇష్టపడి పని చేశారు.

డైరెక్టర్ సాయికృష్ణ తల్లాడ మాట్లాడుతూ నేను సినిమాలు చేస్తున్నప్పుడు విడుదల సమయంలో థియేటర్లల్లో సరైన టైమ్ కి విడుదల అయ్యేలా కృషి చేసారు శంకర్ గారు, అప్పుడు ఒక సినిమా మీద శంకర్ గారికి ఉన్న గౌరవం తెలుసుకున్నాను, అలాంటి డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు నిర్మాత గా మారి నన్ను వారి బ్యానర్లో నేను డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది. అలానే చిన్నప్పుడు ఆది, లక్ష్మి లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు వి.వి.వినాయక్ సార్ ని ఎప్పుడు కలవాలని అనుకునే వాడిని, అలాంటిది ఈ రోజు సార్ చేతుల మీదుగా 1స్ట్ లుక్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీ గా ఉంది, మా టీం అందరూ కరోనా టైమ్ లో తగిన జాగ్రత్తలు తీసికొని ఈ ప్రాజెక్ట్ ని షూట్ చేసాం, మా టీం అందరికి ధన్యవాదాలు.

నటి నటులు :- రాజు అనేం, మాధురి, బేబీ హాసిని, గౌతమ్ రాజు,భద్రం, కిషోరో దాసు,శాంతి స్వరూప్ తదితరులు.

కథ మాటలు- శివ కాకు,
సంగీతం:- వి.ఆర్.ఏ.ప్రదీప్,
సౌండ్ ఎఫెక్స్ట్స్ :- వెంకట్,
గ్రాఫిక్స్:- రాహుల్ ,

బ్యానర్ :- తేజా హనుమాన్ ప్రోడక్షన్స్,
నిర్మాత :- శంకర్ కొప్పిశెట్టి,
డైరెక్టర్:- సాయికృష్ణ తల్లాడ

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*