సింగపూర్ నుండి ఉగాది పండుగ విశిష్టతను తెలుపుతున్న తెలుగు లఘు చిత్రం..

సింగపూర్: ఉగాది అనగానే తెలుగు రాష్ట్రాలలో ఉండే సందడి కూడా విదేశాలలో ఉండదు. కావలసిన వస్తువులు సమకూర్చుకోవడం కోసం, సెలవు దినం కాకపోయినా పండుగ చేసుకోవాలని ఆరాటపడడం మాత్రం కొంత ఉంటుంది. అయితే ఈ పరుగులలో పిల్లలకు పండుగ విశిష్టత, సంప్రదాయాల వెనుక ఉన్న పరమార్థం గురించి తెలియకుండా పోతున్నాయి. యాంత్రికంగా కొత్త బట్టలు వేసుకోవడం పిండివంటలు తినడమే పండుగనుకొనే రోజులు వస్తున్నాయి.

అందుకే సింగపూర్ లో నివసించే కొన్ని ప్రవాసాంధ్ర కుటుంబాలలో, ఉగాది విశిష్టత గురించి తల్లిదండ్రుల ద్వారా పిల్లలు తెలుసుకునే ఇతివృత్తంతో సాగే ఈ లఘు చిత్రం అందరినీ ఆకర్షిస్తోంది. చక్కటి పాత్రలు సంభాషణలతో సింగపూర్ తెలుగు టీవీ ద్వారా యూట్యూబ్ లో విడుదలై అందరి ప్రశంసలు అందుకుంటోంది.

ఈ లఘు చిత్రంలో నటీనటులుగా ఖ్యాతి గణేశ్న, వందన నాదెళ్ల , మౌక్తిక నాగెళ్ల , అక్షర మడిశెట్టి, రత్నకుమార్ కవుటూరు, ప్రత్యూష అవధానుల, దివ్య మరందని, కిరణ్ కుమార్, మూర్తి నాగేళ్ల , కథ & సంభాషణ : కళ్యాణ్ ధవల & మాధురి మంతా, దర్శకత్వం: కళ్యాణ్ ధవల & రాధా కృష్ణ గణేశ్న ఎడిటింగ్ & సాంకేతిక సహకారం :రాధా కృష్ణ గణేశ్న, నిర్వహణ : కాత్యాయనీ గణేశ్న నిర్వర్తించారు.

ఈ లఘుచిత్రమును  వీక్షించుటకు కింది లింక్ క్లిక్ చేయండి:

https://www.youtube.com/watch?v=SSwO7GQ5Zqc

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*