రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో భక్తి సంగీత విభావరి 

హైదరాబాద్: భజనలు, మెడిటేషన్‌తో కూడిన ఆన్ లైన్‌ భక్తి సంగీత విభావరిని నిర్వహించనున్నట్టు వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(వీఐహెచ్ఈ) ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమనికి వీఐహెచ్ఈ డైరెక్టర్ స్వామి బోధమయానంద సమన్వయ కర్తగా వ్యవహరిస్తారు. బెంగళూరుకు చెందిన గాయకుడు, సంగీత దర్శకుడు కార్తీక్ రామన్ ప్రత్యేక అతిధిగా పాల్గొననున్నారు. 25వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 11.45 గం.ల వరకు, 26వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 6.45 గంటల వరకు, 27వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 6.45 గంటల వరకు జరగనుంది.

 

మరోవైపు భయాన్ని, ఒత్తిడిని అధిగమించడంపై ప్రత్యేక ఆన్ లైన్ క్లాసులను నిర్వహించనున్నట్టు వీఐహెచ్ఈ తెలిపింది. ఈ నెల 26 నుంచి మే 1 వరకు తరగతులు జరగనున్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8.30 నుంచి 9.30 వరకు క్లాసులు జరగనున్నాయి. 16 నుంచి 50 ఏళ్ల వయస్సు వారు మాత్రమే అర్హులు. రిజిస్ట్రేషన్ కొరకు 9177232696 నంబరుకి హాయ్ అని వాట్సాప్ చేయగలరు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*