2 ఎకరాల నుంచి 40 క్వింటాళ్ల నల్ల బియ్యం.. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్ధి ఘనత

కరీంనగర్, తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎంఏ యజుర్వేదం చదువుకుంటున్న విద్యార్ధి కౌటిల్యకృష్ణన్ మరో ఘనత సాధించారు. వేద వ్యవసాయ ప్రయోగాలతో 2 ఎకరాల పొలం నుంచి 40 క్వింటాళ్ల నల్ల బియ్యం (కృష్ణ వ్రీహీ) పండించారు. కరీంనగర్ జిల్లా ఖాసింపేట గ్రామంలోని తన పొలంలో గత వానాకాలంలో వచ్చిన పంట నుంచే విత్తన సేకరణ చేసి మరోసారి విజయం సాధించారు. కృషి భారతం వ్యవస్థాపకుడు కూడా అయిన కౌటిల్య కృష్ణన్(86867-43452) కొన్నేళ్లుగా వేద వ్యవసాయ ప్రయోగాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో రైతులు అనుసరించే మండి కట్టే పద్ధతితో పాటు వేద వ్యవసాయ పద్ధతులు అమలు చేసి విజయవంతమయ్యామని కౌటిల్య వెల్లడించారు. వేద వ్యవసాయంలో భాగంగా పాలు, తేనెతో పాటు అగ్నిహోత్ర భస్మం కూడా వాడినట్లు చెప్పారు. ఆవుపేడను ఎరువుగా వాడినట్లు కౌటిల్య తెలిపారు. సుశృత సంహిత ఆధారంగా విత్తనం ఎంపికచేసినట్లు వెల్లడించారు. వృక్ష ఆయుర్వేదం, కృషి పరాశర గ్రంథం ఆధారంగా వేద వ్యవసాయ పద్ధతులు అనుసరించినట్లు తెలిపారు. ఏ మాత్రం రసాయనాలు వాడకుండా వేద వ్యవసాయ పద్ధతుల ద్వారా కృష్ణ వ్రీహీ పండించినట్లు కౌటిల్య తెలిపారు.

తన తాజా వేద వ్యవసాయ ప్రాజెక్ట్ విజయవంతమవడంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్ వి. మురళీధర్ శర్మ, వేదభాష్యం విభాగం, కృషి భారతం వ్యవసాయ విభాగం అధ్యక్షురాలు యశస్వి, కృషి భారతం టీమ్ సహకరించారని చెబుతూ వారందరికీ కౌటిల్య ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ జిల్లా వ్యవసాయ విభాగంతో పాటు ప్రభుత్వం తరపున వేద వ్యవసాయానికి మద్దతిస్తోన్న కరీంనగర్ కలెక్టర్ శశాంకకు కూడా కౌటిల్య ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ శశాంక స్వయంగా కుటుంబ సమేతంగా తన పొలాన్ని సందర్శించి మద్దతు తెలిపారని కౌటిల్య గుర్తు చేశారు.

పోషకాహార విలువలు పుష్కలంగా ఉన్న కృష్ణవ్రీహీకి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతుం గట్టి డిమాండ్ ఉంది. అమెజాన్‌లో నల్లబియ్యం ధర ధర కిలో 800 నుంచి రెండు వేల వరకూ పలుకుతోంది. తన పంటల ద్వారా రైతన్నల్లో అవగాహన పెంచడంతో పాటు, వారిని ఆర్ధికంగా మెరుగైన స్థితిలో ఉంచాలనేది తన లక్ష్యమని కౌటిల్య తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటి అని నిరూపించేందుకు, అన్నదాతల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే దిశగా తాను వేద వ్యవసాయ ప్రయోగాలు చేస్తున్నట్లు కౌటిల్య తెలిపారు.

https://www.facebook.com/102627268570754/posts/118092997024181/

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*