‘‘క్యూరియస్ మైండ్స్’’ ఆన్‌లైన్ విద్యలో ఓ కొత్త విప్లవం..!

ఈ-లెర్నింగ్.. కరోనా అనంతర ప్రపంచంలో విద్యావ్యవస్థకు కీలకంగా మారిన బోధనా విధానం. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇంతకుమునుపే ఈ పద్ధతి గురించి తెలిసినపన్పటికీ.. భౌతిక దూరం పాటించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యవసరంగా మారింది. అయితే.. ఇందులోని కొన్ని ప్రధానమైన సమస్యల కారణంగా విద్యార్థులకు అనుకున్న ప్రయోజం చేకూరట్లేదు. ముఖ్యంగా.. ప్రయోగాలు అవసరమయ్యే సైన్స్ పాఠాలు అర్థం చేసుకోలేకపోవడం, క్లాస్‌రూం వాతావరణానికి దూరంగా ఉండటం వంటి సమస్యలతో విద్యార్థులు ఈ పద్ధతితో పూర్తిగా మమేకం కాలేకపోతున్నారు. పాఠాలు అర్థం కావట్లేదని చెబుతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారంగా మనముందుకు వచ్చింది ‘క్యూరియస్ మైండ్స్ ఇన్‌స్టిట్యూట్’ ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్.

 

క్యూరియస్ మైండ్స్ ఇన్‌స్టిట్యూట్ ప్రత్యేకత ఏంటంటే..ఈ వేదిక ద్వారా విద్యార్థులు సైన్స్ ప్రయోగాలను విద్యార్థులు లైవ్‌లో చూడగలుగుతారు. అంతేకాకుండా.. తమ ఇంట్లో లభించే సామాగ్రితో ఈ ప్రయోగాలను మళ్లీ మళ్లీ చేసి చూసుకోవచ్చు. దీంతో.. వారికి పాఠాల పట్ల ఆసక్తి ఇనుమడిస్తుంది. క్లాస్‌రూంకు దూరంగా ఉన్న విద్యార్థుల మానసిక వికాసంపై కూడా ఈ ప్లాట్‌ఫాం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ఈ సంస్థ వ్యవస్థాపకుడు మనీష్ అనేక చర్యలు చేపట్టారు. సమాచారం గుర్తుపెట్టుకోవడమే ప్రధానంగా సాగుతున్న విద్యావ్యవస్థలో ఓ విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చేందుకు నడుం బిగించింది క్యూరియస్ మైండ్స్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*