
హైదరాబాద్: సాహితీ రంగంలో తనదైన శైలిలో అద్భుత రచనలు చేస్తున్న చంద్రకళ దీకొండ మహాకవి శ్రీ శ్రీ సాహిత్య సేవా జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నారు. సాహితీ బృందావన జాతీయ వేదిక ఆధ్వర్యంలో శ్రీ శ్రీ జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీలో చక్కని కవితను అందించినందుకు గాను ఈ పురస్కారం దక్కింది.
మల్కాజిగిరి, మేడ్చల్ జిల్లాకు చెందిన ఆమె స్కూల్ అసిస్టెంట్(బయాలజీ)గా పని చేస్తున్నారు.
దాదాపు వెయ్యి కవితలను రాసిన చంద్రకళ కవిరత్న, కవితాభూషణ, కలంభూషణ, కవనకిరణం, కవితా శిరోమణి వంటి బిరుదులు అందుకున్నారు. వీటితోపాటు రాజశ్రీ, పుడమిరత్న,కవనకుసుమం, కవితా కణిక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. సాహితీ బృందావన వేదిక ద్వారా రాణి రుద్రమదేవి ఎక్స్లెన్స్ అవార్డ్,సాహిత్య కళానిధి, విశిష్ట మహిళా శిరోమణి అవార్డ్స్ను గతంలో అందుకున్నారు.
Be the first to comment