యువత ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడంపై స్వామి బోధమయానంద వెబినార్

హైదరాబాద్: భవిష్యత్ జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడంపై హైదరాబాద్ రామకృష్ణ మఠం వెబినార్ ఏర్పాటు చేసింది. ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు కార్యక్రమం జరగనుంది. ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలన్స్’ డైరెక్టర్ స్వామి బోధమయానంద ఆధ్వర్యంలో ముఖ్యంగా సీనియర్ సెకండరీ విద్యార్థులను, యువతను ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని జూమ్‌లో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు జూమ్ మీటింగ్ లింక్ కోసం hyderabad.vihe@rkmm.orgకి మెయిల్ చేయాలని నిర్వాహకులు తెలిపారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*