టి‌జే‌ఎఫ్ ఆవిర్భావానికి అంకురార్పణ చేసిన అష్టదిగ్గజాలతో 31న జూమ్ మీటింగ్: మారుతి సాగర్

హైదరాబాద్: తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం తెలంగాణ జర్నలిస్టు ఫోరం సంస్థ ఏర్పడి ఈనెల 31కి సరిగ్గా 20 యేళ్లు. పట్టుమని పది మందితో ఆఖరి మోకా… ఔర్ ఏక్ ధక్కా అంటూ 2001 మే 31న పురుడు పోసుకున్న టీ జె ఎఫ్, 14 యేళ్ల ఉద్యమ ప్రస్థానంలో చెరగని ముద్ర వేసుకుంది. ఉద్యమానికి ఊత కర్రగా మారి ఎన్నో మైలురాళ్లు దాటుకుంటూ ఎందరికో మార్గనిర్దేశం చేస్తూ, సందర్భోచిత పాత్రను నిర్వహించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.

ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వామ్యులం అయిన జర్నలిస్ట్‌లుగా తెలంగాణ జర్నలిస్టు ఫోరం ద్వి దశాబ్ది ఉత్సవాలను స్వరాష్ట్రంలో ఎంతో ఘనంగా నిర్వహించాలనుకున్నాము. కోవిడ్ దెబ్బకు లాక్‌డౌన్‌ పుణ్యమా అని అందరం ఇళ్లకు పరిమితమైన నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా జూమ్ మీటింగ్ పద్ధతిలో ఈ నెల 31 సోమవారం సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేక సమావేశం జరుగుతుంది.

ఈ సమావేశంలో టి జే ఎఫ్ ఆవిర్భావానికి అంకురార్పణ చేసిన అష్టదిగ్గజాలు మన యూనియన్ అధ్యక్షులు అల్లం నారాయణ, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, యూనియన్ సలహాదారులు క్రాంతి కిరణ్, పిట్టల శ్రీశైలం, రమణ కుమార్, కందుకూరి రమేష్ బాబు, శశి కాంత్, రాజేష్ పాల్గొననున్నారు. వీరితో పాటు ప్రస్తుత తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యులు,జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు,అనుబంధ సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు, టి జే ఎఫ్ తో సంబంధం ఉన్న మరి కొంత మంది కూడా పాల్గొనాలని కోరుతున్నాను.

సమావేశంలో ప్రత్యేక అతిథులుగా ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు టి ఎస్ పి ఎస్ సి మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సాక్షి ఎడిటర్ వర్డెల్లి మురళి కూడా పాల్గొననున్నారు.జూమ్ మీటింగ్ సంబంధించిన ఐడి వివరాలు ఆదివారం సాయంత్రం వరకు గ్రూప్ లో అందించగలను.

ధన్యవాదాలతో- ఆస్కాని మారుతి సాగర్, ప్రధాన కార్యదర్శి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*