తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులంటూ టీజేఎఫ్ ఏర్పడింది: మారుతి సాగర్

హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఉద్యమ సంస్థ ఏర్పడి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ నగరంలోని గన్ పార్క్ వద్ద తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపానికి పూలమాలవేసి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో 2001 మే 31న తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అంటూ టీజేఎఫ్ సంస్థ ఏర్పడిందన్నారు. సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణ, పాశం యాదగిరి,క్రాంతి కిరణ్ లాంటి అనేకమంది జర్నలిస్టులు కలిసి తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు చేశారన్నారు ఆ నాటి నుండి స్వరాష్ట్ర కాంక్ష సిద్ధించే వరకు 14 ఏళ్ల పాటు ఉద్యమంలో ఈ సంస్థ క్రియాశీలకంగా వ్యవహరించిందని వివరించారు. రాష్ట్ర సాధన అనంతరం టి జే ఎఫ్ స్పూర్తితో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం గా ఏర్పాటై జర్నలిస్టుల హక్కుల సాధనకై కృషి చేస్తుందని తెలిపారు.

https://www.facebook.com/askani.maruthysagar/posts/4014929905289680

తెంజు అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా జర్నలిస్టులు నాడు ఉద్యమంలో నేడు పునర్నిర్మాణంలో పాల్గొంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందననే నమ్మకం ఉందన్నారు.

టిజే ఎఫ్ వ్యవస్థాపక సభ్యులు రమణ కుమార్ మాట్లాడుతూ ఎక్కడైనా జర్నలిస్టులు తమ హక్కుల కోసం ఉద్యమించడం పరిపాటి అని, కానీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర సాధన లో తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి జర్నలిస్టులుగా ఉద్యమించాలని నిర్ణయం తీసుకుని టి జే ఎఫ్ స్థాపించామన్నారు. ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి దేశ రాజధానిలో జర్నలిస్టులుగా ఆఖరి మొఖా…ఔర్ ఏక్ ధక్కా అంటూ నినదించామని అన్నారు.

కార్యక్రమంలో యూనియన్ నాయకులు నవీన్ కుమార్ యార, అమిత్ భట్టు, సుదర్శన్ రెడ్డి, కొండా శీను తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*