హైదరాబాద్ రామకృష్ణ మఠ్ ద్వారా వివేకానంద బాల్ వికాస్ క్యాంప్ 

హైదరాబాద్: రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(వీఐహెచ్ఈ) ఆధ్వర్యంలో నెల రోజుల పాటు వివేకానంద బాల్ వికాస్ క్యాంప్ జరగనుంది. ఆన్‌లైన్ ద్వారా జరిగే ఈ క్యాంప్‌నకు 4వ తరగతి నుంచి 10వ తగరతి విద్యార్థులు అర్హులు. జూలై 5 నుంచి ఆగస్ట్ 5 వరకు ఈ క్యాంప్ ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు యోగాసనాలు, ధ్యానం, జపం ఉంటాయి. అలాగే సోమ, బుధ, శుక్రవారాల్లో నైతిక విలువల బోధన, భజనలు నేర్పిస్తారు. ఆదివారాలు తరగతులు ఉండవు. చిన్ననాటి నుంచే భారతీయ ఆధ్యాత్మిక, సామాజిక విలువలు నేర్పడం వల్ల వారు దేశం గర్వించే పౌరులుగా తయారౌతారనే సంకల్పంతో ఈ క్యాంప్‌ను నిర్వహిస్తున్నారు. సూర్యనమస్కారాలు, యోగా, ప్రాణాయామం, ధ్యానం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం నేర్పిస్తారు.

 

రిజిస్ట్రేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. https://rkmath.org/vihe/

 

మరిన్ని వివరాలకు 9177232696 నంబర్‌కు ‘Hi’ అని వాట్సాప్ మెసేజ్ చేయగలరు. లేదా hyderabad.vihe@rkmm.orgకు మెయిల్ చేయగలరు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*