
దేశ విభజన ఎంతో మంది జీవితాల్లో విషాదాన్ని మిగిల్చింది.. తూర్పు పంజాబ్ (ఇప్పుడు పాకిస్తాన్) గోవింద్‌పూరాలో జరిగిన ఊచకోతలో ఓ బాలుడు తల్లిదండ్రులను, సోదరులు, సోదరీమణులను పోగొట్టుకున్నాడు.. ఆ అనాధ బాలుడు దిక్కుతోచక ఇతర కాందీశీకులతో కలిసి ఢిల్లీకి వచ్చాడు.. అదృష్టవశాత్తు అక్కడి శరణార్థుల శిబిరంలో తన అక్క కుటుంబాన్ని కలుసుకున్నాడు.. జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు.. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసి పోలీసులకు దొరికి జైలుపాలయ్యాడు. ఆ బాలుడే మిల్ఖాసింగ్..
యుక్తవయసు వచ్చిన తర్వాత మిల్ఖా సింగ్‌కు జీవితంపై విరక్తితో దిక్కుతోచక దొంగగా మారాలనుకున్నాడు. అదృష్టవశాత్తు భారత సైన్యంలో చేరాడు. శిక్షణ కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పంపారు.. సైన్యంలో ఇచ్చే శిక్షణలో భాగంగా ప్రతి రోజూ కిలో మీటర్ల కొద్దీ పరుగెత్తాలి.. అక్కడే మిల్ఖాలోని ప్రతిభ వెలుగులోకి వచ్చింది. చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లడానికి రానుపోనూ 10 కిలో మీటర్లు పరుగెత్తేవాడు. ఆ అనుభవం ఇక్కడ పనికి వచ్చింది. సైన్యం నిర్వహించిన జాతీయ స్థాయి పరుగుపందెంలో మిల్ఖా 6వ స్థానంలో వచ్చాడు..
https://www.facebook.com/mkdmitra/posts/4048455188568621
ఇలా మొదలైన మిల్ఖా సింగ్ పరుగులు క్రీడారంగంలో భారత్ ఖ్యాతిని పెంచాయి. నేషనల్ గేమ్స్, ఏసియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించాడు . దురదృష్ణవశాత్తు చిన్న తప్పిదంతో మిల్ఖా ఒలింపిక్ పతకం కోల్పోయినా ఎన్నో అంతర్జాతీయ రికార్డులు బద్దలు కొట్టాడు.
ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన మిల్ఖాసింగ్‌కు ‘ఫ్లయింగ్ సిఖ్’ అనే గుర్తింపు వచ్చింది. ఆయన జీవితంపై ‘భాగ్ మిల్ఖా భాగ్’ అనే సినిమా కూడా వచ్చింది. కరోనా మిల్ఖా సింగ్ కుటుంబాన్ని కాటేసింది. కొద్ది రోజుల క్రితమే ఆయన భార్య మరణించగా, ఇప్పుడు ఆయన కూడా భౌతికంగా దూరం అయ్యారు. ఓం శాంతి..
క్రాంతి దేవ్ మిత్ర, జర్నలిస్ట్, హైదరాబాద్( 90000 01607 )
మరోవైపు మిల్కాసింగ్ ఇకలేరనే విషయాన్ని జాతి జీర్ణంచుకోలేకపోతోంది. దేశం గొప్ప క్రీడాకారుడిని కోల్పోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
In the passing away of Shri Milkha Singh Ji, we have lost a colossal sportsperson, who captured the nation’s imagination and had a special place in the hearts of countless Indians. His inspiring personality endeared himself to millions. Anguished by his passing away. pic.twitter.com/h99RNbXI28
— Narendra Modi (@narendramodi) June 18, 2021
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళులర్పిస్తూ మిల్కాసింగ్ రికార్డులను గుర్తుచేసుకున్నారు.
India mourns the sad demise of legendary sprinter Shri Milkha Singh Ji, The Flying Sikh. He has left an indelible mark on world athletics. Nation will always remember him as one of the brightest stars of Indian sports. My deepest condolences to his family and countless followers. pic.twitter.com/HsHMXYHypx
— Amit Shah (@AmitShah) June 18, 2021
మిల్కా మరణంపై పలువురు ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.
T 3940 – In grief .. Milkha Singh passes away .. the pride of India .. a great athlete .. a greater human ..
Waheguru di Mehr .. prayers 🙏🙏— Amitabh Bachchan (@SrBachchan) June 19, 2021
Be the first to comment