
హైదరాబాద్: తెలంగాణాకు చెందిన శ్వేతారెడ్డి (17) అనే బాలికకు అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ యూనివర్శిటీ ఏకంగా రూ. 2 కోట్ల రూపాయల స్కాలర్ షిఫ్‌ను ఆఫర్ చేసింది. లఫాయేట్ కాలేజీలో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్‌తో పాటూ ఈ స్కాలర్ షిప్‌కు ప్రకటించింది. డైయర్ ఫెలోషిప్ పేరిట కాలేజీ ఇచ్చే ఈ స్కాలర్ షిఫ్‌కు ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఆరుగురు ఎంపికవగా అందులో శ్వేతారెడ్డి ఒకరు. హైస్కూల్ స్థాయిలో శ్వేతారెడ్డి కనబరిచిన ప్రతిభ, నాయకత్వ లక్షణాలు తమను మెప్పించాయని లాఫాయెట్ కాలేజీ యాజమాన్యం తెలిపింది.
Swetha was 14 when she first came into the Dexterity system. Today, the proud Dexterity to College fellow from Telangana is on her way to Lafayette College, the Hidden Ivy in Pennsylvania. Swetha will pursue a Bachelor's Degree in Math on a ₹2 crore scholarship. #ThisIsDexterity pic.twitter.com/6n7DXtRK47
— The Dexterity Global Group (@DexterityGlobal) July 13, 2021
కాగా.. ఈ స్కాలర్ షిప్ సాధించడం పట్ల శ్వేతా రెడ్డి హర్షం వ్యక్తం చేసారు. ఇది తనకు ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. తనకు ఇటువంటి అద్భుత అవకాశం రావడం వెనుకు డెక్స్టెరిటీ గ్లోబల్ సంస్థ ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహం ఎంతో ఉందని ఆమె పేర్కోన్నారు. డెక్స్టెరిటీ టూ కాలేజ్ అనే కేరిర్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా శ్వేతా నాలుగేళ్ల పాటు శిక్షణ పొందారు. ఈ క్రమంలో నాయకత్వ పటిమతో పాటూ సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోగలిగానని శ్వేతా పేర్కొన్నారు. కేరిర్‌లో తనకు మార్గదర్శిగా నిలిచిన డెక్స్టెరిటీ గ్లోబల్ సంస్థ సీఈఓ శరద్ సాగర్‌కు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు.
మరోవైపు.. శ్వేతకు స్కాలర్ షిప్ రావడం పట్ల డెక్స్టెరిటీ సీఈఓ శరద్ సాగర్ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే తరాల నాయకులను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కేరీర్‌కు సంబంధించి తన సంస్థ ఇచ్చిన ట్రెయినింగ్తో ఎంతో మంది కొలంబియా, యేల్ యూనివర్శిటీ, జార్జి టౌన్, టఫ్ట్స్, కేస్ వెస్టర్న్, నార్త్‌వెస్టర్న్, యూనివర్శిటీ ఆఫ్ టొరంటో, బోస్టన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ లండన్, తదితర ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందారని ఆయన పేర్కొన్నారు.
More than ₹21.93 crores in scholarships this year.
More than ₹71.3 crores in scholarships till date.
Join us as we celebrate and share the stories of proud Dexterity to College fellows, truly India’s local role models, starting July 10 under #ThisIsDexterity campaign. pic.twitter.com/tbu63DBWRZ
— The Dexterity Global Group (@DexterityGlobal) July 6, 2021
హైదరాబాద్ రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ తరపున నిర్వహించిన యువ సంఘర్ష్ పోటీలో శ్వేత ఫైనల్స్ పార్టిసిపెంట్.
Be the first to comment