
హైదరాబాద్: భారతీయుల ఆరోగ్య విధానాలైన యోగా, ఆయుర్వేదం ద్వారా ఆరోగ్య సంరక్షణ కోసం హైదరాబాద్ రామకృష్ణ మఠం ప్రత్యేక కోర్సు నిర్వహించనుంది. యోగా, ఆయర్వేదం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తును పొందవచ్చంటూ పలువురు నిపుణుల ద్వారా క్లాసులు నిర్వహించనుంది. యోగా, ఆయర్వేదం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకనేలా టెక్నిక్స్ నేర్పుతారు.
జూలై 26 నుంచి 31 వరకు ఆరు రోజుల పాటు ఆన్లైన్ విధానంలో ఈ తరగతులు జరగనున్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు జరిగే ఈ తరగతులు.. ఉదయం 8.30 గంటలకు మొదలై 9.30 గంటలకు ముగియనున్నాయి. 16 ఏళ్లు పైబడిన వారు అర్హులు.
మరిన్ని వివరాలకు 9177232696 నంబర్‌కు ‘Hi’ అని వాట్సాప్ మెసేజ్ చేయగలరు. లేదా hyderabad.vihe@rkmm.orgకు మెయిల్ చేయగలరు.
Be the first to comment