
హైదరాబాద్: కరోనా వేళ ప్రయాణికుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. కళా బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కళాకారులు తమ పాటలతో ప్రజల్లో అవగాహన పెంచుతారు. టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో వీధుల్లో, బస్టాప్‌లలో, షాపింగ్ మాల్స్‌లలో తిరుగుతూ పాటల రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడంలో ప్రాధాన్యతను వివరిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఎంత సురక్షితమో కూడా తెలియజేస్తారు.
ఈ కార్యక్రమాలపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రీజినల్ మేనేజర్ ఎస్ఆర్ అండ్ పీఆర్, డివిజనల్ మేనేజర్లు ప్రత్యేక దృష్టి పెట్టారు. కళా బృందాల్లో పెంటోజి, శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు.
Be the first to comment